Revanth reddy makes controversial comments on kcr | telangana Martyrs | trs controversies

Revanth reddy mahanadu speach telangana martyrs trs controversies kcr

revanth reddy, kcr, telangana martyrs, kcr, telangana state, mahanadu news, revanth reddy mahanadu, chandrababu naidu, ktr updates

Revanth reddy Mahanadu specah telangana Martyrs trs controversies kcr : tdp mla Revanth reddy makes controversial comments on kcr in mahanadu speach.

తెలంగాణ అమరవీరుల లెక్కలేవి కేసీఆర్..?

Posted: 05/28/2015 11:24 AM IST
Revanth reddy mahanadu speach telangana martyrs trs controversies kcr

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో అమరవీరులయ్యారు. నాలుగుకోట్ల జనాలకు సొంత రాష్ట్రం కావాలని కోరుతూ తమ ప్రాణాలు విడిచారు. అటువంటి వీరులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు గుర్తింపే లేకుండా పోయిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం కోసం అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం.. ఇంతవరకు అలా చేయకపోవడం చాలా దారుణమని అన్నారు.

మహానాడు సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది వివరాలను 12 గంటల్లో నమోదు చేసినట్టు ప్రకటించిన కేసీఆర్‌.. అధికారం చేపట్టి 12 నెలలు గడిచినా అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆదుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో కోళ్లు, పందుల లెక్కలు నమోదు చేసిన కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల లెక్కలు తేల్చకపోవడం వారి త్యాగాలను అవమానపరచడమేనని పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో అసువులు బాసిన 1569 మంది అమరవీరుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన తొలి ఉద్యమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 369 మంది విద్యార్థులను కాల్చి చంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2001లో మలి ఉద్యమం మొదట్లో ‘నేను, నాకు వండిపెట్టే ముసలిది మాత్రమే ఇక్కడ ఉన్నాం, పిల్లలు అమెరికాలో ఉన్నారు’ అని చెప్పిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్మారని అన్నారు.

బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన శ్రీకాంతాచారి.. ఇక్కడి పరిస్థితి చూసి చలించి వంటిపై పెట్రోల్‌ చల్లుకుని ఆత్మబలిదానం చేసుకున్నాడని గుర్తు చేశారు. మంటల్లో కాలిపోతున్నా అమ్మా అనకుండా జై తెలంగాణ... అంటూ ప్రాణత్యాగం చేశాడని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ కిష్టయ్య, యాదిరెడ్డి వంటి వారెందరో బలిదానాలు చేసుకున్నారని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను.. ఉద్యమానికి నాయకత్వం వ హించిన కేసీఆర్‌ను నమ్మి ఆయన చేతిలో పెట్టారని అన్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు రూ.10 లక్షలు అందిస్తామని ప్రకటించి పట్టించకోలేదన్నారు. అధికారం చేపట్టి 12 నెలలైనా 1200 మందిలో ఇప్పటి వరకు కేవలం 481 మందినే గుర్తించామంటే మిగిలిన అమరవీరులను అవమానపర్చినట్టేనని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గన్‌పార్క్‌లో అమరవీరుల స్ధూపాన్ని నిర్మించి 40 ఏళ్లు గడిచినా అధికారికంగా ప్రారంభించలేదని అన్నారు. హుస్సేన్‌సాగర్‌ బుద్ధుడికి సమాంతరంగా తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

తెలుగుదేశం అధికారంలోకి వస్తే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని వెయ్యి కోట్లతో నిర్మిస్తామని రేవంత్ పేర్కొన్నారు. అలాగే గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని చెప్పారు. విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ సాకారమైందని పలుమార్లు ప్రకటించిన కేసీఆర్‌ ఓయూ భూములు కబ్జా చేయడానికి వచ్చి పోరగాళ్లకు అవగాహన లేదనడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఏపీలో డీఎస్సీ పరీక్ష పెట్టి టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, తెలంగాణలో ఎందుకు డీఎస్సీ పెట్టడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ను కుర్చీ నుంచి దించేందుకు టీడీపీ కార్యకర్తలు ఉద్యమించాలని, అది కేవలం టీడీపీకే సాధ్యమని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  kcr  telangana martyrs  mahanadu  

Other Articles