Telangana, cm, kcr, Rasamaye Balakishan, Kalabharati

Telangana cm kcr started kalasaradhi but it getting troubles

Telangana, cm, kcr, Rasamaye Balakishan, Kalabharati

Telangana cm kcr started kalasaradhi but it getting troubles. Cm appointed Mla Rasamaye Balakishan as Kalasaradhi president. Some people oppose the Balakishan decisions.

సాంస్కృత సారథి కాదు.. వివాదాలకు వారధి

Posted: 05/28/2015 09:47 AM IST
Telangana cm kcr started kalasaradhi but it getting troubles

తెలంగాణ సాంస్కృత సారథిపై రగడ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులను ఆదుకునేందుకు సాంస్కృత సారథి పేరు మీద వేదికను ఏర్పాటు చేశారు. ఇలా వారికి భరోసా ఇవ్వడంతో పాటు కళాకారులకు ఉద్యోగాలు కూడా ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఇదే కళకారుల మధ్య చిచ్చుబెట్టింది. కళాకారుల మధ్య విభేదాలు తలెత్తేలా కేసీఆర్ ప్రకటన ఉందని కొంత మంది విమర్శలు చేస్తున్నారు. అయితే కళాకారులను ఎంపిక చెయ్యడంలో కొంత మంది మాత్రం్ తమ వారికి స్వలాభం చేకూరుస్తున్నారని మండిపడుతున్నారు. కాగా సాంస్కృత సారథికి అధ్యక్షుడిగా రసమయి బాలకిషన్ ను ఎ:ంపిక చెయ్యడం వివాదానికి మూలమైంది.

తాజాగా దరువు అంజన్న అదృశ్యం రాష్ట్రంలో దుమారాన్నే రేపింది.  అంజన్నను కిడ్నాప్‌ చేశారంటూ ఆయన భార్య, సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రసమయి బాలకిషనే కిడ్నాప్‌ చేయించారని వారు ఆరోపించారు. ఓయూజేఏసీ చైర్మన్‌ దరువు ఎల్లన్న ఆధ్వర్యంలో ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దరువు అంజన్నకు ఎలాంటి ప్రమాదం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిజమైన కళాకారులకు ఉద్యోగాలివ్వాలంటూ... దగాపడ్డ కళాకారులందరినీ సమీకరించి నిరసన ధూంధాంను నిర్వహించినందుకు అంజన్నపై రసమయి కక్ష పూనినట్లు వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, కళాకారుల ఫిర్యాదులు, హెచ్చరికలు ఇలా ఉండగా... తరువాత రోజు సాయంత్రం దరువు అంజన్న ప్రత్యక్షమయ్యారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గజ్జెకట్టి పాడిన కళాకారులను పక్కన పెట్టి, ఉద్యమంతో ఏమాత్రమూ సంబంధం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆగ్రహించిన కళాకారులు కళాకారుల దీపం కేసీఆర్‌.... సాంస్కృతిక సారథికి శాపం రసమయి బాలకిషన్ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన దరువు అంజన్న తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యంపై పాటపాడారు. అంతేకాక రసమయి బాలకిషన్‌ ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో గళమెత్తారు. దీంతో, రాత్రి 11గంటలకు రసమయి బాలకిషన్‌ తనకు ఫోన్‌ చేసి ‘నామీదే పాట పాడతావరా..? నీ అంతుచూస్తా’ అంటూ బెదిరించారని అంజన్న తెలిపారు. ప్రాణభయంతో ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయానని,ఫ్రెండ్‌ వద్ద ఉన్నానన్నారు. రసమయి నుంచి తనకు, తన కుంటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. మొత్తానికి తెలంగాణ సర్కార్ ప్రారంభించిన  సాంస్కృత సారథి కళాకారులకు మధ్య వివాదాలకు వారధిగా మారింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  cm  kcr  Rasamaye Balakishan  Kalabharati  

Other Articles