ap | special status | shivaji | subbiram Reddy

Congress senior leader t subbbiramireddy call to strike on june 6 at rajamandry

ap, special status, shivaji, subbiram Reddy, TSR, Rajamandry

Congress senor leader T. Subbbiramireddy call to strike on june 6 at Rajamandry. After Hero shivaji strike subbiramireddy gos for special status for ap.

అప్పుడు శివాజీ.. ఇప్పుడు సుబ్బిరామిరెడ్డి

Posted: 05/25/2015 01:49 PM IST
Congress senior leader t subbbiramireddy call to strike on june 6 at rajamandry

సుబ్బిరామి రెడ్డి గురించి వార్తల్లోకి వచ్చింది అంటుే ఏ ప్రోగ్రామ్ లోనో పాల్గొని ఉంటారు అనుకోకండి. తాజాగా సుబ్బిరామిరెడ్డి దీక్ష చేపట్టనున్నారట. ఏంటీ నిజమా...? సుబ్బిరామిరెడ్డి ?? దీక్షా..? అనకోకండి . నిజంగా ఆయన గారు దీక్షకు దిగుతున్నారు. ఇది పక్కా న్యూస్ కూడా. ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ జూన్ 6న దీక్ష చేస్తానని ఆయన వెల్లడించారు. అయితే గత కొంత కాలంగా ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ పై కేంద్రం నుండి ఎలాంటి స్పందన రావడం లేదు. దాంతో చిరవకు సుబ్బిరామిరెడ్డి దీక్షకు సిద్దమవుతున్నారు.

ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని హీరో శివాజీ దీక్ష చేసినా పాపం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మీడియాలోనూ పెద్దగా న్యూస్ నరాకపోవడం విశేషం. అయితే తాజాగా సుబ్బిరామిరెడ్డి దీక్షకు మాత్రం మీడియా ప్రయారిటీ ఇస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్దపోదని రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. జూన్ 3, విశాఖపట్నం, 4న విజయనగరం, 5న శ్రీకాకుళం జిల్లాల్లో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో జూన్ 6న రాజమండ్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేస్తానని అన్నారు. విశాఖ విమ్స్ ను ఎయిమ్స్ గా మార్చాలని, హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరి సుబ్బిరామిరెడ్డి దీక్ష సక్సెస్ అవుతుందా..? లేదా అన్న విషయం జూన్ 6న తేలుతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  special status  shivaji  subbiram Reddy  TSR  Rajamandry  

Other Articles