Mukesh Ambani pays Rs 1.6 crore registration fees for his new Rs 8 cr BMW

Mukesh ambani spends rs 1 6 crores for car registration

Mukesh Ambani pays Rs 1.6 crore registration fees, Mukesh Ambani BMW car, Mukesh Ambani's Assets, Mukesh Ambani, Mukesh Amabni's Cars, Top industrialists of India, RIL, Mumbai's RTO, BMW News, BMW Price, BMW Review

Head Honchos from Reliance India Limited have been known for their fancy set of wheels. This time around Mukesh Ambani from Reliance Industries Limited has invested over Rs. 8 Crores in a high-end armored 7-series vehicle.

కారు ఖరీదే.. రిజిస్ట్రేషన్ ఫీజు అంబాని కారా.. మజాకా..!

Posted: 05/20/2015 09:08 PM IST
Mukesh ambani spends rs 1 6 crores for car registration

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడు. అంతే కాదు సంపన్నులలో సామ్రాట్ అని కూడా అనవచ్చు. ప్రతిష్టాత్మక ఫోర్బ్ మ్యాగజీన్ నిర్వహించిన సర్వేలలో అనేక పర్యాయాలు దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానం అధిరోహించిన వాణిజ్యవేత్త. మరి ఇలాంటి వ్యక్తులు ఏం చేసినా.. అది కాస్తా సంచలనంగానే మారుతుంది. తాజాగా అంబానీ ముంబైలో ఓ కారు రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ ఫీజుగానే ఆయన చెల్లించిన మొత్తం అక్షరాలా.. రూ. 1.6 కోట్లు!! బీఎండబ్ల్యు 7 సిరీస్ కారును ఆయన ఇటీవలే కొనుగోలు చేశారు. సాధారణంగా తాము నిబంధనల ప్రకారం వాహనం విలువలో 20 శాతం మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేస్తామని ఆ శాఖ ఉద్యోగి ఒకరు తెలిపారు.

ఆ లెక్కన ఆ కారు విలువ దాదాపు 8 కోట్ల రూపాయలు. అయితే అది కేవలం కారు ఖర్చు మాత్రమే కాకపోవచ్చని, దానికి చేసిన ఇతర హంగుల వల్ల కూడా ఆ ఖరీదు పెరిగి ఉండొచ్చని అంటున్నారు. ఈ బీఎండబ్ల్యు కారు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. దాని ఛాసిస్తో పాటు అద్దాల మీద కూడా ఎలాంటి ఆయుధాల దాడి ప్రభావం ఏమాత్రం ఉండబోదు. వాస్తవానికి అంబానీ కొన్న బీఎండబ్ల్యు 760ఐ కారు ఖరీదు రూ. 1.9 కోట్లు మాత్రమే. కానీ దానికి జర్మనీలో చేయించిన బుల్లెట్ప్రూఫ్.. ఇతర సదుపాయాలు అన్నీ కలిపి దాని విలువ రూ. 8.5 కోట్లు అయ్యిందని, అందుకే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పెరిగిందని చెబుతున్నారు. ఈ కారును ప్రత్యేకంగా జర్మనీలో ఆర్డర్ చేసి తయారుచేయించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mukesh ambani  bmw car  car registration  

Other Articles