isis | smoking | punishment | video

Isis terrorists punishment for smoking

isis, smoking, punishment, video

isis terrorists punishment for smoking. isis terrorists punished cruel for cigar smoking. latest video gos viral in social media.

ITEMVIDEOS: సిగరెట్ తాగినందుకు చితకొట్టారు

Posted: 05/20/2015 03:50 PM IST
Isis terrorists punishment for smoking

క్రమశిక్షణ..ఎక్కడ పని చేస్తున్న ఇది ఉండాలి. ఒకవేళ లేకపోతే మాత్రం చాలా కష్టం. అయితే అన్నింటికన్నా మిలిటరీలో మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన రూల్ ఇది. అయితే తాజాగా తమ రూల్స్ తామే బ్రేక్ చేసినందుకు చితకొట్టారు. ఇంతకీ ఏ దేశ ఆర్మీలో జరిగింది అని అనుకుంటున్నారేమో కానీ జరిగింది ఆర్మీలో కాదు ఐఎస్ఐఎస్ లో. అవును ఉద్రవాద కార్యకలాపాల ద్వారా ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న ఆ ఐఎస్ఐఎస్ వాళ్లే. తాము పెట్టుకున్న నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి సిగరెట్లు తాగారని సొంత గ్రూపు ఫైటర్లనే ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చావు దెబ్బలు కొట్టింది.  వారిని కర్కశంగా కొడుతూ రక్తం కళ్ల చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

ఆ వీడియోలు చూపించిన ప్రకారం సిగరెట్ తాగిన కొందరు సొంత ఫైటర్లనే వరుసగా ఓ గోడకు ఎదురుగా కూర్చోబెట్టి ఉంచారు. కొందరు ముసుగు ధరించిన ఉగ్రవాదులు వారిపై కాళ్లు పెట్టి ఎక్కుతూ దిగుతూ కనిపించారు. అంతేకాకుండా వారి చేతుల్లోని తుపాకీ బ్యారెల్తో చితక్కొట్టుడు కొట్టారు. మరొకరినైతే ఏకంగా తల బద్ధలయ్యేలా బాదారు. పిడిగుద్దులు కురిపించారు. పొగత్రాగడం ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకమని, పొగతాగడమంటే మెల్లగా ఆత్యహత్య(స్లో స్యూసైడ్)కు పాల్పడటమేనని వారు భావిస్తారట. ఇకపై ఎవరు ఎలాంటి దిక్కార చర్యలకు దిగకూడదని వారిని క్రూరంగా హింసించినట్లు ఆ ఉగ్రవాద సంస్థ పేర్కొంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  smoking  punishment  video  

Other Articles