nda government killed land acquisition act says rahul gandhi

Government killed the land acquisition bill brought by upa rahul gandhi

Rahul Gandhi, Land Acquisition Bill, NDA government, suit-boot ki sarkar, government hurry to pass bill, anti-farmer and anti-poor government, ,L K Advani, Sushma Swaraj, Rajnath Singh, nitin gadkari, social impact assessment,

Rahul Gandhi today accused the NDA government of "killing" the Land Acquisition Act brought by the UPA and said Congress will fiercely resist within and outside Parliament the attempt of "suit-boot ki sarkar" to "grab" farmers' land.

సూట్ భూట్ కీ సర్కార్ అంటూ పార్లమెంటులో రాహుల్ తీన్మార్..

Posted: 05/12/2015 09:19 PM IST
Government killed the land acquisition bill brought by upa rahul gandhi

భూసేకరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంటులో అమోదం కానివ్వబోమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భూసేకరణ బిల్లుపై ఇవాళ మరోమారు రాహుల్ కేంద్రంలోని మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో వున్న ప్రభుత్వం రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. అంతటితో ఆగకుండా కేంద్రంలోని సూటు భూటు సర్కారు.. రైతులు భూములను లాగేసుకోకుండా తాము పార్లమెంటులోనూ, పార్లమెంటు వెలుపల అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.

ఏకాభిప్రాయ సాధన కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదని ఆయన లోక్ సభలో ఆరోపించారు. యూపీఏ తెచ్చిన బిల్లును ఎన్డీఏ సర్కారు ఖూనీ చేసిందని వాపోయారు. బిల్లును ఆమోదింప జేసుకునేందుకు మోదీ సర్కారు హడావుడి చేస్తోందన్నారు. యూపీఏ హయంలో ఈ బిల్లును అమోదించడానికి తమకు రెండేళ్లు పట్టిందని ఆయన గుర్తు చేశారు. ఈ బిల్లును గోడ్డలి పెట్టతో ఎన్డీఏ ప్రభుత్వం నరికేసిందని ఆరోపించారు. రైతుల నుంచి తీసుకున్న భూములలో ఐదేళ్లలో ఏలాంటి ప్రాజెక్టు రాని పక్షంలో వాటిని తిరిగి రైతులకే అప్పగించాలన్న నిబంధనను మోడీ ప్రభుత్వం తొలగించిందన్నారు. ఐదేళ్ల కాలాన్ని పది, ఇరవై, యాభై ఏళ్లుగా కూడా మర్చవచ్చని అరోపించారు. రాజస్థాన్, తదితర ప్రాంతాలలో వున్న భూమునలు వదిలేసి.. నోడియా లాంటి పారిశ్రామిక ప్రాంతాలలో మాత్రమే భూములను తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శఇంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులూ మీ కాళ్ల కింద బంగారు గని వుంది.. దానిని కల్లగొట్టడానికే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారికి సూచించారు.

భూస్వాముల కోసమే ఈ బిల్లు తెచ్చారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను ఎన్డీఏ సర్కారు బేఖాతరు చేస్తోందని ధ్వజమెత్తారు. రైతుల భూములను ఎన్డీఏ సర్కారు కాజేస్తోందని మండిపడ్డారు. ఆరునూరైనా బిల్లు ఆమోదింపజేయనీయమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ బిల్లును యూపీఏ ప్రభుత్వం ఆమోదించనప్పడు ప్రతిపక్షంలో వున్న ఎల్కే అద్వాని, సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్ లాంటి నేతలు తమ హర్షధ్వానాలతో అమోదాన్ని తెలిపారని, కానీ ఇప్పుడు దానికి బీజేపి ప్రభుత్వమే తూట్టు పోడుస్తుంటే ఎందుకు మౌనం వహించారో అర్థం కావడం లేదని రాహుల్ విస్మయం వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Land Acquisition Bill  NDA government  

Other Articles