Agrigold | Hyderabad | Dharna

Agrigold customers did dharna in hyderabad

Agrigold, Hyderabad, Dharna, Nellore, Guntur,

Agrigold customers did dharna in hyderabad. Agrigold customers facing problems from lasr one year. The Company facing cbi investigation by the order of ap govt.

ఆరని అగ్రిగోల్డ్ వివాదం.. హైదరాబాద్ లొ బాధితుల ధర్నా

Posted: 05/05/2015 10:36 AM IST
Agrigold customers did dharna in hyderabad

వందల కోట్ల రూపాయల సొమ్ములను కస్టమర్ల దగ్గరి నుండి వసూలు చేసి, ప్రస్తుతం పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న సంస్థ అగ్రిగోల్డ్ సంస్థ. గత కొంత కాలంగా ఖాతాదారులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తూ వచ్చిన ఈ సంస్థ ప్రస్తుతం సీబిఐ విచారణ సాగుతుండటంతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. నిన్నటి దాకా నెల్లూరు, గుంటూరు ప్రాంతాలకు పరిమితమైన ఆందోళనలు ప్రస్తుతం హైదరాబాద్ కూ విస్తరించాయి.  హైదరాబాద్ పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద డిపాజిట్దారులు, ఏజెంట్లు ఆందోళనకు దిగారు. తమ డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఇటీవల ఖాతాదారులకు చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం, సంస్థ విజయవాడ కార్యాలయంలో సీబీఐ సోదాలు వంటివి అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులకు  ఆందోళనకు కలిగించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక,ఒడిశాలో ఉన్న ఖాతాదారులు పెద్దసంఖ్యలో ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్ సంస్థలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు కాలపరి మితి ముగిసిన తర్వాత సొమ్ము చెల్లింపులో కొన్ని నెలులుగా తీవ్ర జాప్యం జరుగుతోంది. గట్టిగా అడిగిన వారికి చెక్కులిచ్చి పంపిస్తున్నారు. వాటిని బ్యాం కులో వేస్తే సంస్థ ఖాతాలో సొమ్ము లేక తిరిగి వచ్చేస్తున్నాయి. తమను మోసం చేసి బోర్డు తిరగేసేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని పలువురు ఆరోపించారు. ఇప్పటికే ఏపి ప్రభుత్వం అగ్రిగోల్డ్ పై పూర్తి స్థాయి సిబిఐ విచారణకు ఆదేశించింది. గత వారం కిందటే అగ్రిగోల్డ్ సంస్థ ఓ పత్రిక ప్రకటనను విడుదల చేసింది. సంస్థ కార్యక్రమాలకు ఆటకం కలిగిన మాట వాస్తవమే అని, కానీ సంస్థ పూర్తి నమ్మకంగా పని చేస్తుందని ప్రకటనలో అగ్రిగోల్డ్ పేర్కొంది. ఏజెంట్లను ఇబ్బందులు పెట్టవద్దని కూడా అందులో పేర్కొంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Agrigold  Hyderabad  Dharna  Nellore  Guntur  

Other Articles