Annahazare | Kejriwal | Swamyagnevesh | Death

Swamy agnivesh fire a bomb on kejriwal that kejriwal wish to death of anna hazare

kejriwal, anna, agnivesh, hazare, arvind kejriwal, delhi, elections, protest, lokpal,

swamy agnivesh fire a bomb on kejriwal that kejriwal wish to death of anna hazare. The social worker swamy agnivesh sectences contraversial statements on kejriwal. The delhi cm kejriwal wish the death of anna hazare for political benifit for kejriwal.

హజారే చావును కోరుకున్న కేజ్రీవాల్..?

Posted: 04/15/2015 11:12 AM IST
Swamy agnivesh fire a bomb on kejriwal that kejriwal wish to death of anna hazare

ఆప్ అధినేత కేజ్రీవాల్ పై గత కొంత కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవాలని గతంలో కేజ్రీవాల్ ట్రై చేశారని ఓ ఆడియో టేప్ విడుదల అయింది. అది ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర సంచలనమే రేపింది. తాజాగా సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ అరవింద్ కేజ్రీవాల్ పై బాంబ్ పేల్చారు. హజారే చేపట్టిన ఆమరణ దీక్ష ఎక్కువ రోజులు కొనసాగి ఆయన చనిపోతే తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరతాయని కేజ్రీవాల్ ఆశించారన్నారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష సందర్భంగా హజారే చనిపోతే బావుండని కేజ్రీవాల్ కోరుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. హజారే ఆమరణ నిరాహారదీక్షను నిరవధిక నిరాహార దీక్షగా మార్చాలనే పార్టీ ప్రతిపాదనకు  కేజ్రీవాల్ గట్టిగా అడ్డు తగిలారనీ, పైగా ఉద్యమం ఇపుడు త్యాగాలను కోరుతోందంటూ వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనమన్నారు. హజారే చనిపో్తే తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చనే కేజ్రీవాల్ దురుద్దేశం స్పష్టమవుతోందన్నారు.  

ప్రముఖ సామాజికవేత్త చేసిన ఆరోపణలు ఢిల్లీని షేక్ చేస్తున్నాయి. అన్నా హజారీ దీక్షకు దిగివచ్చిన ప్రభుత్వం డిమాండ్లకు అంగీకరించి,  హజారే ఉద్యమాన్ని విరమింపజేసింది కానీ, లేకపోతే ఇంకో పది రోజులు హాజారే దీక్ష కొనసాగాలని కేజ్రీవాల్ కోరుకున్నారని స్వామి అగ్నివేశ్  అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలిపై తాను ఆనాడే యోగేంద్ర యాదవ్ని హెచ్చరించానన్నారు.  మొత్తానికి ఢిల్లీలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆప్ ఇప్పుడు సమస్యల సుడిగుండంలొ చిక్కుకుంది. నిన్నటి దాకా రెబల్ నేతలతో తల పట్టుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు స్వామి అగ్నివేశ్ మాటలతో ఎంత ఇబ్బంది పడుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kejriwal  anna  agnivesh  hazare  arvind kejriwal  delhi  elections  protest  lokpal  

Other Articles