Dmdk | Dmk | Vijaykanth

Dmdk president vijaykanth trying to close to the dmk

Dmk, Dmdk, vijaykanth, bjp, nda, Tamilnadu,

Dmdk president vijaykanth trying to close to the Bjp, Nda. Dmdk president vijaykanth tie with bjp in the last elections and also the party got large num. seats. present the Dmdk party tring to tieup with Dmk.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. తమిళ'నాట'కం

Posted: 03/31/2015 09:27 AM IST
Dmdk president vijaykanth trying to close to the dmk


తమిళనాడు రాజకీయాలు అంటే దేశంలోనూ ఎంతో కీలకం. అలాంటి తమిళ నాట రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా అనే అనమానాలు కలుగుతున్నాయి. తమిళనాడులో అధికారం కోసం ప్రయత్నిస్తున్న డీఎండీకే అధినేత విజయకాంత్ తన రూట్ ను మార్చకుట్లున్నారు. డీఎంకేతో దోస్తీ కోసం సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే మిత్రపక్షం గా బరిలోకి దిగిన విజయకాంత్ పెద్ద సంఖ్యలోనే సీట్లను సంపాదించారు. తరువాత అమ్మ పార్టీ నుండి విభేదించి మోదీకి జై అన్నారు. కానీ ఉప ఎన్నికల్లో మాత్రం బిజెపి అభ్యర్థి తరఫున ప్రచారానికి కూడా దిగలేదు.
 
గత అసెంబ్లీ సమావేశాల సమయంలో డీఎండీకే ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటుపడింది. రెండు సమావేశాలకు హాజరుకాకుండా స్పీకర్ వేటు వేశారు. స్పీకర్ చర్య ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని డీఎండీకే ఎమ్మెల్యేలకు మద్దతుగా డీఎంకే అధినేత కరుణానిధి బహిరంగ ప్రకటన చేశారు. ఎవరి ప్రకటనలకూ అంతగా స్పందించే అలవాటులేని విజయకాంత్ కరుణానిధికి కృతజ్ఞతలు చెప్పడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బహిష్కృత డీఎండీకే ఎమ్మెల్యేలు సచివాలయంలో ధర్నా చేపట్టిన సమయంలో డీఎంకే సభ్యులు స్టాలిన్, దురైమురుగన్ తదితరుల మద్దతును కోరారు. డీఎంకే నేతలు సైతం డీఎండీకే ఎమ్మెల్యేల బహిష్కరణ ప్రజాస్వామ్య విరుద్ధమంటూ సంఘీభావం ప్రకటించారు. డీఎండీకే డీఎంకే కూటమిలో చేరాలని ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మరో పార్టీ నేత కోరగా సమయం వచ్చినపుడు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని విజయకాంత్ ప్రకటించారు. మొత్తానికి విజయ్ కాంత్ రాజకీయాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఓ దశలో శత్రువులుగా చూసిన వారితోనే దోస్తీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కనీసం డిఎంకే తోనైనా దోస్తీ పదిలంగా ఉంటుందా అని అనుమానాలు వస్తున్నాయి. మరి తమిళనాట రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dmk  Dmdk  vijaykanth  bjp  nda  Tamilnadu  

Other Articles