Telangana | Vehcles | Tax

Telangana has decided that all motor vehicles from ap will be treated as vehicles from other states

ap, telngana, trasport, vehcles, bifercations, contract carriages, goods carriages, motor cabs, maxicabs

The transport department of Telangana has decided that all motor vehicles entering Telangana from AP will be treated as vehicles from other states. This means that vehicles including contract carriages, goods carriages, motor cabs, maxicabs, commercial tractor trailers, passenger autorickshaws, etc. will have to pay a separate quarterly tax from April 1, 2015. This is likely to directly reflect on fares as operating costs will go up substantially.

ఉమ్మడి రవాణాకు మంగళం.. తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం

Posted: 03/31/2015 09:55 AM IST
Telangana has decided that all motor vehicles from ap will be treated as vehicles from other states

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు రోజుకొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి.  ఇప్పటి వరకు ఉన్న ఉమ్మడి రవాణాకు తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అన్ని వాహనాల పర్మిట్లు తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ పరిధిలోనే ఉంటాయని, ఆంధ్రప్రదేశ్‌ వాహనాల్ని ఇతర రాష్ట్రాల వాహనాలుగానే పరిగణిస్తామని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకోనుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉన్నందున అప్పటి వరకు ఉమ్మడి రవాణాను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు గవర్నర్‌ ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి ఈనెల 31 తో ముగుస్తుంది. దీనిపై న్యాయస్థానం కూడా ఇరు ప్రభుత్వాలు చర్చించుకొని, నిర్ణయాన్ని ప్రజలకు తెలపాలని చెప్పింది. తాజాగా ఉమ్మడి రవాణా గడువు ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం పది జిల్లాల్లోని అన్ని రకాల వాహనాల పర్మిట్లు ఇక్కడికే పరిమితమౌతాయని ఉత్తర్వుల్లో స్పష్టం
చేసింది.
   
అయితే రెండు రాష్ట్రాల ఉమ్మడి రవాణాకు సంబందించి చర్చించి ఓ నిర్ణయం వెలువడుతుందని అప్పట్లో అనుకున్నా. అవి ఏవీ కార్యరూపం దాల్చలేదు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు స్వయంగా తెలంగాణ రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డిని కలిసి ఉమ్మడి రవాణాపై చర్చిద్దామని ప్రతిపాదించారు. అధికారులతో మాట్లాడి మరుసటి రోజు చర్చిద్దామని మహేందర్‌రెడ్డి చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మాట్లాడుకుందామన్నారు. ఇప్పుడు అవేవీ లేకుండా ఉమ్మడి రవాణాకు స్వస్తి పలుకుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి  రవాణా ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఖజానాకు కలుగుతున్న నష్టాన్నిగుర్తించింది. తెలంగాణ కు నష్టం కలుగుతుండటంతో పాటు కేవలం ఏపికి మాత్రమే లాభం కలుగుతోంది. అందుకే తెలంగాణ సర్కార్ ఉమ్మడి రవాణాను నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విభజన సమయంలో అనుకున్నట్లు హైదరాబాద్ ను పది సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి రవాణా కు అవకాశం కల్పించారు. అయితే ఉమ్మడి రవాణా తమకు ఎంతో నష్టం కలిగిస్తోందని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. అందుకే ఏపి వాహనాలను ఇతర రాష్ట్రాల వాహనాల కింద లెక్కేసి, పర్మిట్ లకు తెర తీసింది. మరి ఏపి సర్కార్ దీనిపై ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  telngana  trasport  vehcles  bifercations  contract carriages  goods carriages  motor cabs  maxicabs  

Other Articles