Telngana | Power | 24/7

Telangana may get 24hours power supply from central govt

telangana, power, distributuion, powercut, kcr, modi, centralgovt, electricity,

telangana may get 24hours power supply from central govt. the central govt formally agree to supply uninterupted power supply to the new state telangana. telangana cm kcr wrote a letter to pm modi on power supply.

కరెంట్ కష్టాలకు కట్.. నిరంతర విద్యుత్ కు కేంద్రం రెడీ..!

Posted: 03/31/2015 09:11 AM IST
Telangana may get 24hours power supply from central govt

తెలంగాణకు కేంద్రం తీపి కబురు అందిస్తోంది. అసలే వేసవి కాలం మొదలైంది కరెంట్ కోతలు తప్పవని అందరకి భమయం ఉంది. అయితే తెలంగాణలో నిరంతర విద్యుత్ ను సరఫరా చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే ఎంపిక చేసిన ఢిల్లీ, రాజస్థాన్‌, ఏపీ సరసన తెలంగాణనూ చేర్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో నెలకొన్న విద్యుత్తు కొరతను అర్థం చేసుకోవాలని, కొత్తగా చేపట్టే కొత్త విద్యుత్కేంద్రాలకు సాయమందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్‌ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితి సమీక్షించేందుకు కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా నేతృత్వంలోని కేంద్ర అధికారులు సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు కొరత, ప్రభుత్వం కొత్తగా చేపడుతోన్న కొత్త ప్లాంట్ల గురించి రాజీవ్‌ శర్మ వివరించారు. మూడేళ్లలో మిగులు విద్యుత్తు సాధించే దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ నివేదిక అందించారు. జ్యోతి అరోరా బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిరంతర విద్యుత్‌ సరఫరా రాష్ట్రాల్లో తెలంగాణనూ చేర్చాని సమావేశంలో అధికారులు కోరారు. ఇందుకు కేంద్ర బృందం సూత్రప్రాయంగా అంగీకరించింది.

కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. అయితే తెలంగాణ సిఎం విద్యుత్ కొరతను నివారించడానికి చాలా ప్రయత్నాలను చేశారు. అందులో భాగంగా పక్క రాష్ట్రాల నుండి విద్యుత్ ను కొనుగోలు చెయ్యడం జరిగింది. వేసవిలో తీవ్రంగా కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో, పరిశ్రమలకు కష్టాలు తప్పవని అందురూ అనుకున్నారు. కానీ కేంద్రం నిరంతర విద్యుత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కరెంట్ కష్టాలు ఇప్పుడు ఉండవనే చెప్పొచ్చు. కేంద్రం తెలంగాణ కు 24 గంటల విద్యుత్ సరఫారాకు ముందుకు వస్తే, ప్రస్తుతానికి కరెంట్ కష్టాల నుండి గట్టెక్కినట్లే. అయితే తెలంగా సర్కార్ చేపడుతున్న చర్యలతో భవిష్యత్ లో తెలంగాణ మిగులు విద్యుత్ ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని కేంద్రం గట్టిగా నమ్ముతోంది. అదే గనక నిజమైతే తెలంగాణకు ఇక ఎప్పటికీ కరెంట్ కష్టాలు అంటే తెలియకుండాపోతాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  power  distributuion  powercut  kcr  modi  centralgovt  electricity  

Other Articles