Enforcement Directorate attaches Dasari assets in Coal Scam

Telugu content

Dasari, Coal Scam, Jindal, ED Attaches Dasari assets

Dasari Naryana Rao assets attached due to COAL SCAM

ఏమి సేప్తిరి ఏమి సేప్తిరి! అటాచ్‌ అయినవి వ్యక్తిగత ఆస్తులు కావు.

Posted: 03/30/2015 11:49 PM IST
Telugu content

ఏమి సేప్తిరి ఏమి సేప్తిరి దాసరిగారూ.!!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణంలో మాజీ కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు ప్రమేయం ఉన్నట్లు సీబీఐ తేల్చేసింది. జిందాల్‌ కంపెనీ నుంచి 2.25 కోట్లు క్విడ్‌ ప్రోకో రూపంలో దాసరి కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఈ కేసులో భాగంగా సీబీఐ, ఈడీ అధికారులు దాసరిని పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే.

బొగ్గు కుంభకోణం కేసులో సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావుకి చెందిన రూ. 2.25 కోట్ల ఆస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఆయన ఆ శాఖ మంత్రిగా వున్న సమయంలో బొగ్గు నిక్షేపాల కేటాయింపుల్లో జిందాల్ కంపెనీకి అక్రమంగా మేలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆ కంపెనీ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య మీడియాకు చెందిన ఎకౌంట్లోకి రూ. 2.25 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని పేర్కొంటూ ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

మనీ లాండరింగ్‌ ద్వారా సౌభాగ్య మీడియాలోకి పెట్టుబడులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. జిందాల్‌ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా గనుల్ని కేటాయించడం వల్లనే ఈ పెట్టుబడులకు తెరలేచిందనే ఆరోపణలు వెల్లువెత్తడమంటే దాసరి నారాయణరావు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లే.

అయితే, దాసరి వాదన ఇంకోలా వుంది. అటాచ్‌ అయినవి తన వ్యక్తిగత ఆస్తులు కావనీ, సౌభాగ్య మీడియా సంస్థలో తాను వాటాదారుడ్ని మాత్రమేననీ, అది లిస్టెడ్‌ కంపెనీ అని దాసరి చెబుతున్నారు. కానీ, సౌభాగ్య మీడియా.. అంటే అది దాసరి సొంత సంస్థ అన్న భావన వుంది. మిగతా విషయాలెలా వున్నా, సౌభాగ్య మీడియాలో తాను వాటాదారుడ్ని మాత్రమేనని దాసరి అనడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పైగా, సౌభాగ్య మీడియా ఆస్తులు అటాచ్‌ అయి వుండొచ్చని ఆయన లైట్‌ తీసుకోవడం మరింత ఆశ్చర్యపరిచింది అందర్నీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Dasari  ED  COAL SCAM  Jindal  

Other Articles