Wasn't driving, wasn't drunk, Salman Khan deposes in Court

Salman khan tells court he wasn t driving the car

Bollywood superstar Salman Khan, salman khan in Hit and Run case, salman Khan deposed in mumbai sessions court, salman Khan accused in hit-and-run case, salman khan on hit-and-run case, salman khan tells court he wasn't drunk, salman khan tells court he wasn't driving car, salman khan hit-and-run case, Salman Khan, Hit And Run Case, Court, Statement

Bollywood superstar Salman Khan, who is an accused in the hit-and-run case on Friday deposed in a sessions court and said that he was not driving the car at the time of mishap on September 28, 2002.

కారు నడపలేదు, మద్యం సేవించలేదు: సల్మాన్ ఖాన్

Posted: 03/27/2015 08:06 PM IST
Salman khan tells court he wasn t driving the car

తాను బాలివుడ్ స్టార్ గా పేరుప్రఖ్యాతులు వున్నందునే పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన వాంగ్మూలన్ని వినిపించారు.2002 సెప్టెంబర్ 28న హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ ఇవాళ కోర్టు మెట్లుఎక్కారు. కోర్టు బోనులో నిలబడి తన వాంగ్మూలాన్నివినిపించారు. తుది వాదనలు ప్రారంభించేందుకు వీలుగా సల్మాన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా ఇటీవల కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు.

కోర్టులో వాంగ్మూలం వినిపిస్తున్న క్రమంలో కోర్టు హాలులో మిడియాను అనుమతించవద్దని ఆయన పెట్టుకున్న పిటీషన్ ను న్యాయమూర్తి డీ.ఎస్ దేశ్ పాండే తిరస్కరించారు. అయితే విచారణ  పూర్తయ్యేవరకు వివరాలు వెల్లడి చేయొద్దని మీడియాను కోరారు. 2002లో మద్యం మత్తులో కారు నడిపి ఫుట్పాత్ మీద నిద్రిస్తున్నఒకరు మరణించడానికి, నలుగురు గాయాలకు బాధ్యుడిగా అభియోగాలు నమోదైన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన పైన సత్యదూరమైన కథనాలతో కేసును బనాయించారని చెప్పారు.

వాంగ్మూలంలో సల్మాన్ ఖాన్ చెప్పిన విషయాలు ఇవే:

* కారు ప్రమాదం జరిగినప్పుడు నేను కారు నడపడం లేదు.
* కారు ప్రమాదంలో తన వైపునున్న కారు జామ్ కావడంతోనే డ్రైవర్ వైపు డోర్ నుంచి దిగాను.
* కారు ప్రమాద ఘటనకు తనకు ఏ సంబంధమూ లేదు. అది పూర్తిగా తప్పుడు కేసు
* కారు ప్రమాదం జరిగినప్పుడు నేను మద్యం సేవించివున్నానడం అబద్దం
* ప్రమాదం సంభవించగానే నా డ్రైవర్ అశోక్ సింగ్ పోలీసులకు లొంగిపోయాడు
* పోలీసులు నా డ్రైవర్ మాటను లక్ష్యపెట్టకుండా నాపై కేసు నమోదు చేశారు
* ఆ రోజున డ్రైవర్ తెల్లని చోక్కా, బ్లూ డెనిమ్ జీన్స్ ధరించాడు
* నేను చెప్పినదాని కంటే ఢిపెన్స్ సాక్షులు చెప్పిన వాటినే పరిశీలిస్తాను.
* నా రక్తనమూనాలు తీసుకున్న బాలశంకర్ నిపుణుడు కాదు
* రక్తంలో మద్యం కలిసిందన్న ప్రోసీడింగ్స్ కూడా అతనికి తెలియవు
* బాలశంకర్ నివేదికను కెమికల్ అనాలసిస్ నిఫుణులు తోసిపుచ్చారు.
* కెమికల్ అనాలసిస్ నిఫుణులుకు నా రక్త నమూనాలలో మధ్యం వున్నట్లు తేలలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Hit And Run Case  Court  Statement  

Other Articles