Ponnala removed from tpcc post

ponnala removed from tpcc post. congress high command remove ponnala laxmiah from tpcc post. newly uttamkumar appionted as tpcc chairman.

ponnala removed from tpcc post

పొన్నాలా..పో.పో.. కొత్త పిసిసిగా ఉత్తమ్ కుమార్

Posted: 02/28/2015 03:12 PM IST
Ponnala removed from tpcc post

కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్యయ్యకు ఆ పార్టీ అధిష్టానం పెద్ద షాక్‌నిచ్చింది. టీ పీసీసీ పదవి నుంచి పొన్నాల లక్ష్మయ్యను అధిష్టానం తొలగించింది. సాధారణ ఎన్నికల కంటే ముందు పొన్నాలకు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పింది. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఎన్నికల తర్వాత కూడా పొన్నాల పార్టీలో అందరినీ కలుపుకొని పోవడం లేదని విమర్శలు వెలువెత్తాయి.  ఈ క్రమంలోనే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని దిగ్విజయ్‌సింగ్ పలు మార్లు ఆదేశించారు. అయినప్పటికీ సభ్యత్వ నమోదులో విఫలం కావడం.. ఆ పార్టీకి చెందిన నేతలే పొన్నాలను విమర్శించడం జరిగింది. పొన్నాల పీసీసీ పదవిలో కొనసాగితే పార్టీ నాశనం కావడం ఖాయమని అదే పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శించారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా సీనియర్ నేత, హుజుర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియామిస్తు అధిష్టానం నిర్ణయం తీసుకుంది.  కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే ఈ మార్పు చేసినట్లు సీనియర్ నేతలు అంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క నియామకం అయ్యే అవకాశం ఉంది. అయితే గత మూడు నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ లభించలేదు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ponnala  tpcc  uttamkumar  ponnala laxmiah  

Other Articles