Delhi 29 year old nigerian woman alleges gangrape four held

Nigerian woman alleges gangraped in delhi, 29-year-old woman of African origin women gangraped, nigerian women gangraped in car, nigerian woman, gangrape, crime against women, South Delhi rape, Chilla border, violence against women, foreigner gang raped, women organisations, congress, shiela dishit, nirbhaya incident, women organizations, bjp, aap, aravind kejriwal, narendra modi, pm modi mann ki baat

A 29-year-old woman of African origin on Friday alleged gang-rape by four men in a car, who later pushed her out of the moving vehicle near east Delhi’s Chilla border.

ఢిల్లీలో మరో దారుణం, విదేశీయురాలిపై గ్యాంగ్ రేప్..

Posted: 02/21/2015 11:48 AM IST
Delhi 29 year old nigerian woman alleges gangrape four held

దేశ రాజధాని హస్తినలో మరో దారుణం జరగింది. 29 ఏళ్ల విదేశీ వనితపై సామూహిక అత్యచారం జరిగింది. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన విదేశీ వనితపై కామాంధులు కాటువేశారు. కారులో ఎక్కించుకుని ఆమైపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అనంతరం విదేశీ వనితను కారు నుంచి తోసిసి పారరయ్యారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. దక్షిణ ఢిల్లీలోని ఛత్తార్ పూర్ లో వున్న ఫామ్ హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న నైజీరియన్ మహిళ బస్సుకోసం బస్టాఫ్ లో నిల్చుంది. అదే సమయంలో హుందాయ్ ఎసెంట్ కారులో వచ్చిన నలుగురు యువకులు రాఖేష్, సన్నీ, దీపక్, జాన్సన్ అమెను తన ఇంటి చెంత దింపుతామని నమ్మబలికి కారులో ఎక్కించుకున్నారు.

కారులో ఎక్కిన మహళపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే దారుణాన్ని బయటకు తెలిసేలా మహిళ చేసిన ఆక్రందనలు వినబడకుండా అమె నోటికి బిగ్గరగా నోక్కారు. దక్షిణ ఢిల్లీ నుంచి బయలుదేరిన కారు నోయిడా, రింగ్ రోడ్డు మీదుగా మళ్లీ ఢిల్లీకి చేరుకునేంత వరకు అమెపై మగమృగాల్లు అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే పోలీసు చెక్ పోస్టులను తప్పించుకునేందుకే వారు ఈ మార్గం ఎంచుకున్నారని పోలీసుల తెలిపారు. తూర్పు ఢిల్లీకి తిరిగి చేరకున్న క్రమంలో చిల్లా సరిహద్దు వద్ద పోలీస్ చెక్ పోస్టును చూసిన తరువాతే వారు విదేశీ మహిళను కారులోంచి నెట్టివేశారని పోలీసులు తెలిపారు. భాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని ఐడెంటిఫైయింగ్ పరేడ్ నిర్వహించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలిని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నామని చెప్పారు.

ఇప్పటికే అమెరికా సహ పలు దేశాలు భారత్ లో పర్యటించడం సురక్షితం కాదని తమ దేశస్థులను హెచ్చరించాయి. భారత్ లో రానురాను మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా దేశాలు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశాయి. అయినా.. ఒకటి అర ఘటనే చోటుచేసుకుంటున్నాయని, విదేశీ మహిళలకు భారత్ అండగా నిలుస్తుందని, వారి రక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటుందని.. యూపీఏ ప్రభుత్వ హయాంలో పర్యటక శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చిరంజీవి భరోసా ఇచ్చారు. అయితే కోత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నా.. మగమృగాళ్లు మాత్రం మరో విదేశీ మహిళపై విరుచుకుపడి తమ కామవాంఛ తీర్చుకున్నారు.

కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా.. ఇంకా నిర్భయ ఘటనలు ఢిల్లీలో రాజ్యమేలుతున్నాయి. నిర్భయ ఘటనతో రెండున్నరేళ్ల క్రితం అప్పటి కేంద్ర, రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్రతిష్టను మూటగట్టుకున్నాయి. అత్యాచార ఘటనల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినా.. న్యాయం వేగిరంగా జరిగేలా చర్యలు చేపట్టినా లాభం లేదు. నేరస్థులకు త్వరితగతిన శిక్ష ఖరారు అవుతున్నా.. ఈ తరహా నేరాలకు పాల్పడే వారికి భయం పుట్టడం లేదు. ఇన్ని చేసినా అప్పటి ప్రభుత్వాలను ఆ తరువాత వచ్చిన ఎన్నికలలో ఘోర ఓటమి పాలయ్యాయి. ప్రజలు బ్రహ్మరథం పట్టి తెచ్చుకున్న ప్రభుత్వాలు కేంద్రంతో పాటు ఢిల్లీలో కొలువుదీరినా.. ఇంకా సామూహిక అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి.

ఈ ఘటన నేపథ్యంలో మరోమారు విదేశాలు తమ దేశస్థులకు భారత్ లో పర్యటించవద్దని హెచ్చరికలు జారీ చేసే ప్రమాదముంది. ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నేరం జరగిన తరువాత శిక్షలు వేగిరం చేయడం కన్నా.. నేరం చేయడానికి జంకే విధంగా చర్యలు వుండాలని మహిళా సంఘాల నేతలు కోరుతున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేసే విధంగా, స్త్రీలకు మన సంస్కృతిలో లభించే గౌరవాన్ని తెలిపే విదంగా పార్యాంశాలలోనూ మార్పలు చేయాలని, యువతకు దిశా నిర్థేశం చేయాలని వారు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ అంశంపై తన రేడియో ప్రసంగం మన్ కీ బాత్ లోనూ ప్రస్తావించిన పక్షంలో కొంతైనా నేరాలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. ఇక మన ఇళ్లకు వచ్చే అతిధులకు మనం ఇచ్చే గౌరవాన్నే విదేశాల నుంచి మన దేశానికి వచ్చే అతిధులకు, పర్యాటకులకు ఇవ్వాలన్న సందేశాన్ని కూడా ప్రజల్లోకి ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో తీసుకువెళ్లాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nigerian woman  gangrape  South Delhi rape  Chilla border  

Other Articles