5 dead including gunman in us shooting

5 dead including gunman in georgia, 5 dead including gunman in us shooting, shooting in atlanta, shooting in sub urban atlanta, shooting at douglasville, man shot his ex wife and children, Douglas County Sheriff's Lt. Glenn Daniel, gunman killed himself,

Five people were dead, including the gunman, after a shooting in a housing development in suburban Atlanta that also left two children injured

అమెరికా అట్లాండలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

Posted: 02/08/2015 11:50 AM IST
5 dead including gunman in us shooting

అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. అట్లాంటా నగర శివారు ప్రాంతంలోని డగ్లస్వెల్లో జరిగిన ఘటనలో విషాదం చోటు చేసుకుంది.సాయుధడైన ఓ వ్యక్తి తన మాజీ భార్య ఇంట్లోకి ప్రవేశించి... విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మరణించగా... ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. అనంతరం కాల్పుల జరిపిన వ్యక్తి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ మేరకు డగ్లస్ కౌంటీ ఉన్నతాధికారి డేనియల్ ఆదివారం వెల్లడించారు. అయితే గాయపడిన ఇద్దరు చిన్నారులు కోలుకుంటున్నారని, వారికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతి చెందిన వారిని గుర్తించ వలసి ఉందన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తికి, మరణించిన ఆమెకు విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయం తెలియలేదని....  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మృతుడు గురించిన వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. కాల్పుల ఘటనపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో... ఘటన స్థలానికి చేరుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోలీసు ఉన్నతాధికారి తాను స్థానికంగా ఉద్యోగబాధ్యతలను నిర్వర్తిసూ సుమారు 20 ఏళ్లు పూర్తి అయ్యిందని, అయితే తన సర్వీసులు ఇంతటి దారుణ ఘటనను ఇప్పటి వరకు చూడలేదని డేనియల్ చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US shooting  Douglasville  gunman  shooting  5 dead  

Other Articles