Unemployed british father peter rolfie gives birth 26 children

peter rolfie 26 children, british government, unemployed father 26 children

unemployed british father peter rolfie gives birth 26 children

15 మంది భార్యలతో 26 పిల్లల్ని కన్నా నిరుద్యోగి!

Posted: 01/30/2015 07:25 PM IST
Unemployed british father peter rolfie gives birth 26 children

బ్రిటన్’లో పనీపాటాలేని ఓ నిరుద్యోగి వరుసగా పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకుని సంచలనం సృష్టించాడు. 15 మంది మహిళలతో పెళ్లి చేసుకుని ఏకంగా 26 మంది పిల్లల్ని కన్నాడు. వారిలో 14 మంది ఆడపిల్లలు కాగా, 12 మంది మగపిల్లలు. అతగాడు పేరు పీటర్ రోల్ఫీ. 64 ఏళ్ల వృద్ధుడైన ఈ నిరుద్యోగికి ఉద్యోగం దొరక్కకాదు.. పనిచేయడానికి చాలా బద్ధకం. అందుకే.. బ్రిటీష్ చట్టాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వం ఇచ్చే భృతితోనే ఖాళీగా కాలం గడుపుతూ 26 మంది పిల్లల్ని కనేశాడు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఈ నిరుద్యోగి ప్రభుత్వ భృతితో సాఫీగా జీవితం కొనసాగించడమే కాకుండా భారీ మొత్తంలో చిల్లుపెట్టాడు. ఇప్పుడు ఇంకా కావాలంటూ మళ్లీ కోర్టుకెక్కాడు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వ డబ్బులతోనే సాఫీగా జీవితం కొనసాగించిన ఈ నిరుద్యోగి.. ఇప్పుడు 26 మంది పిల్లలు పెరిగిపోవడంతో మరింత డబ్బు, ఇల్లు కావాలంటూ కోర్టుకెక్కాడు.

బ్రిటీష్ చట్టాలప్రకారం.. నిరుద్యోగులకు భృతి ఇవ్వడం, పిల్లలు పోషణార్థం వారి పేరిట నెలనెలా డబ్బులివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాని విభాగాలకే వుంటుంది. దీంతో ఈ చట్టాలనే ఆసరాగా తీసుకుని దేశంలో చాలా కుటుంబాలు పనీపాటా లేకుండా బ్రతికేస్తున్నాయి. ఇందులో భాగంగానే పీటర్ రోల్ఫీ కూడా ఒకడు. అయితే.. 2013లో వచ్చిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఆర్థిక సంస్కరణలే ఎజెండాగా పెట్టుకుని ఈ నిరుద్యోగ, పిల్లల పోషణ భృతులను ఎత్తివేయాలని ప్రయత్నించారు. అయితే.. ఇలా వున్నట్లుండి భృతిని నిలిపివేస్తే నిరుద్యోగులంతా రోడ్డున పడాల్సి వస్తుందని అన్ని పక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో.. దానిని నిలిపివేయకుండా కోతలు విధించారు. దీంతో ఈ వ్యవహారం సర్దుకుపోయింది. అయితే.. ఇలా కోతలు విధించడంతో ఈ 26 పిల్లల తండ్రి పీటర్’కు ఆర్థికపరంగా చాలా ఇబ్బందులు రావడంతో మరిన్ని డబ్బులకోసం కోర్టుకు ఎక్కాడు.

మొన్నటివరకు ఇతగాడు తన కుటుంబంతో నివసించిన 3 బెడ్’రూంల ఇళ్లు ఇప్పుడు ఇరుకుగా కావడంతో.. తనకు 5 బెడ్ రూంల ఇల్లు కావాలని స్థానిక కౌంటీ ప్రభుత్వం వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. అందుకు కౌంటీ అధికారులు అంగీకరించకపోవడంతో మనోడు ఏకంగా కోర్టుకెక్కాడు. సుదీర్ఘకాలంపాటు న్యాయపోరాటం చేసిన అనంతరం చివరికి కేసు గెలిచి.. కోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు ఇతగాడికి స్థానిక ప్రభుత్వం 'ఐజిల్ ఆఫ్ వైట్' ద్వీపంలో ఐదు బెడ్ రూంల ఇంటిని కేటాయించింది. అయితే.. ఇంతటితో మనోడు సంతృప్తి చెందకుండా.. తనకు ఇల్లు కేటాయించడంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యంగా ఇచ్చిందని, అందుకు తనకు 93 వేల రూపాలయలు నష్టపరిహారంగా చెల్లించాలని న్యాయ సలహాదారుడికి నోటీసులు పంపించాడు. అందుకు న్యాయసలహాదారుడు అంగీకరించినా.. అధికారులు మాత్రం చేతులెత్తేశారు.

ఎందుకంటే.. ఇప్పటికే పీటర్ కుటుంబాన్ని పోషించడానికి ఏడాదికి దాదాపు రూ.47 లక్షలు చెల్లిస్తున్నామని, ఇంతకుమించి చెల్లించడానికి కుదరదంటూ అధికారులు తేల్చి చెప్పేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పీటర్.. తానేమీ రాజ భవనంలో నివసిస్తూ భోగభాగ్యాలు అనుభవించడం లేదని, పిల్లల పోషణార్థమే నష్టపరిహారం కోరుతున్నానని వాదించడం మొదలుపెట్టేశాడు. తాను ఆశించింది దొరికేంతవరకు న్యాయపోరాటం చేస్తానని అతగాడు ప్రతిజ్ఞ కూడా చేశాడు. చూశారా వీడి పిచ్చి.. నిరుద్యోగి కదా అని ప్రభుత్వం చేరదీస్తే.. ఆ ప్రభుత్వానికి చిల్లు చేస్తూ ఎలా లాగిస్తున్నాడో!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : peter rolfie 26 children  british government  unemployed father 26 children  

Other Articles