Jarkhand cm candidate seat for non tribal

raghuvar das, bjp party jarkhand, amit sha, jarkhand cm raghuvar das, jarkhand cm seat is going to raghuvar das, bjp party state vice presindent, bjp government jarkhand

bjp going to form the government jarkhand cm will be raghuvar das

జార్ఖండ్ సి.ఎంగా ఎవరో మరి..?

Posted: 12/24/2014 10:37 AM IST
Jarkhand cm candidate seat for non tribal

నిన్న వెలువడిన ఫలితాల్లో జార్ఖండ్ లో బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాలను దిగ్విజయంగా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి ఆసక్తి ముఖ్యమంత్రి పీతం పై ఉంది బిజెపి అధినాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందని అందరరూ అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. సి.ఎం పీటం కోసం ఎవరి ప్రయత్నాలు వారు బిజెపి అగ్ర నాయకత్వం దగ్గర చేస్తున్నారు.  జార్ఖండ్ లో తొలిసారిగా గిరిజనేతర నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గిరిజనేతర నాయకుడితో సహా పలువురు పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలవడంతో వెనుకబడ్డారు. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్‌దాస్(జంషెడ్‌పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే), పార్టీ సిద్ధాంతకర్త సరయూరాయ్(జంషెడ్‌పూర్ వెస్ట్ ఎమ్మెల్యే), మాజీ స్పీకర్ సీపీ సింగ్ (రాంచీ ఎమ్మెల్యే) పేర్లు తెరపైకి వచ్చాయి.

సీఎం రేసులో ఉన్నవారెవరూ పెదవి విప్పడం లేదు. ఎమ్మెల్యేనే సీఎం అవుతారని, ఎంపీ లేదా ఓడిపోయిన అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోరని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీంతో అర్జున్ ముండాకు అవకాశం లేనట్టేనని అర్థమవుతోంది. అమిత్‌షాకు సన్నిహితుడు, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న రఘువర్‌దాస్ కే సీఎం పీఠం దక్కే ఛాన్స్ ఉంది. ఎవరికీ దక్కే ఛాన్స్ ఎంతగా ఉన్నప్పటికీ అస్సలు నాయకుడి(మోడీ) చూపు ఎవరి మీదుందో మరి...!!

హరికాంత్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuvar das  bjp jarkhand  amit sha  

Other Articles