Two states results announced pdp largest party in j k bjp to form govt in jharkhand

recent two states elections, recent election results in india, india elections, jammu and kashmir election results, jarkhand election results and review, bjp going to spread the cadre in india, bjp party in twoo states, bjp government states

two states results announced, PDP largest party in J&K, BJP to form govt. in Jharkhand

ప్రత్యేక కథనం: రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమగ్ర రాజకీయ విశ్లేషణ

Posted: 12/24/2014 08:09 AM IST
Two states results announced pdp largest party in j k bjp to form govt in jharkhand

రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.., రెండు రాష్ట్రాలలోని.., జార్ఖండ్ లో భాజపా పూర్తిగా తన ఆధిక్యత ప్రదర్శించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కదులుతుంది. ఇంకొక రాష్ట్రము లో భాజపా కి చెప్పుకోదగ్గ ఫలితాలు వెలువడ్డాయనే చెప్పాలి. ఎందుకంటే ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ లో బి జె పి పార్టీ రెండవ స్థానంలో నిలిచింది అంటే., పార్టీ తన క్యాడర్ ను పెంచుకుందనే చెప్పాలి.మరి ముఖ్యంగా పాకిస్తాన్ తన దుర్బుద్ధిని ప్రయోగిస్తూ పదే పదే కాశ్మీర్ సరిహద్దులో మన వీర సైనుకులను బాలి తీసికుంటున్న వేళా... కేంద్రంలో కూడా అధికారం కలిగి ఉన్నభాజపా ఆ విధమైన ఆధిక్యతను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రములో సాధించటం ఒక విధంగా శుభ పరిణామమే అని చెప్పుకోవాలేమో..!! జమ్మూ-కశ్మీర్‌లో ఎప్పటిలాగే సంకీర్ణ ప్రభుత్వమే ఈసారి కూడా రాజ్యమేలబోతున్నది. 28 స్థానాలతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అగ్రభాగంలో ఉంటే.., 25 స్థానాలు గెల్చుకుని బీజేపీ ద్వితీయ స్థానంలో ఉంది. ఇంతవరకూ అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ 15 స్థానాలను గెల్చుకుంది, కాంగ్రెస్ 12 స్థానాలు గెల్చుకుంది. వరస వైఫల్యాలతో కుదేలవు తున్న కాంగ్రెస్ ఎప్పటిలానే రెండు రాష్ట్రాల్లోనూ అపజయాన్నే మూటగట్టుకున్నది. కనీసం ఇప్పటికైనా ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకొని, పార్టీ లొ కొంత ప్రక్షాళన గావించి ప్రజల కోసం పరితపించి పని చేసే పార్టీ గా ఎదగటానికి ఇంకా అవకాశాలు ఉన్నాయేమో.. కాని ఆ పార్టీ కి నాయకత్వ సమస్య కూడా వేదిస్తున్నదనే చెప్పాలి. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలోనే పార్టీ బాధ్యతలను పూర్తిగా తన మీద వేసుకొని ఎంతో శ్రమించిన రాహుల్ గాంధీ తన ప్రభావాన్ని ఏ మాత్రం చూపించలేకపోయారు. ప్రజలు మార్పు ను కోరుకున్నారు. తర్వాత జరిగిన ఎన్నికలోనూ ఇదే తంతు కొనసాగింది. పార్టీ యువతరానికి మార్గ దర్శకుడైన జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు తనే ఇరకాటంలో పడ్డారు. ఇప్పుడు పార్టీ కి దశ దిశ ను నిర్దేశించే అనుభవజ్ఞుడైన ఒక నాయకుని అవసరం ఎంతైనా ఉందేమో...


ఇప్పుడు జమ్మూ-కశ్మీర్‌లో ఓటర్లు వెలువరించిన తీర్పు అటు పీడీపీకి, ఇటు బీజేపీకి పెద్ద పరీక్షే పెట్టింది. ఎన్నికల సభల్లో మోదీ 'తండ్రీ కొడుకుల పాలన'.., 'తండ్రీ కూతుళ్ల పాలన' అంటూ అటు ఎన్‌సీని, ఇటు పీడీపీని విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒకరినొకరు విమర్శించుకోవడం., అంతలోనే కౌగలించుకోవడం సర్వసాధారణం. కనుక ఆ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాబోదు అనిపిస్తుంది. ఒకవేళ బలమైన పీడీపీతో వెళ్లడంవల్ల తనకు పెద్దగా ప్రయోజనం కలగదని బీజేపీ భావించిన పక్షంలో ఎన్‌సీతో జట్టుకట్టినా కట్టొచ్చు. గతంలో ఎన్‌సీ ఎన్డీయే భాగస్వామిగా ఉన్నది గనుక ఇది అసాధ్యమేమీ కాదు. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ రెండు పార్టీలకూ మరికొందరి తోడ్పాటు అవసరమవుతుంది. అలాగే పీడీపీ-కాంగ్రెస్‌లు కలవాలనుకున్నా ఇతరుల మద్దతు తప్పనిసరి. కాని ఇప్పటికే పిడిపి పార్టీ కి కాంగ్రెస్ తాను మద్దతు ఇస్తానంటూ తన తలుపులు తెరిచి ఆహ్వానించింది.

జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నపుడు తన అధికార లక్ష్యం కోసం కొన్ని విషయాలను బిజెపి పక్కన పెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ విషయాలను ప్రస్తావించిన మరు క్షణం తన లక్ష్యానికి తూట్లు పడే ప్రమాదం ఉందని యా పార్టీ గ్రహించింది. జమ్మూ-కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలని గొంతెత్తే అల వాటున్న బీజేపీ ఈసారి ఆ విషయంలో అస్పష్టంగా, ఇంకా చెప్పాలంటే మౌనంగా ఉండిపోయింది. అలాగే కొన్ని విషయాల్లో పరిమితులు ఏర్పర్చుకున్నది. కాశ్మీర్ పండిట్ల విషయం లో జమ్మూ ల మాట్లాడినంతగా మల్లి కాశ్మీర్ లో మాట్లాడలేకపోయింది. అప్పటికే కాశ్మీర్ లోయలో లడఖ్ ప్రాంతంలో ఒక్క సీట్ ను గెలుచుకోలేకపోయింది. ఏది ఏమైనా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి అనే పేరుతో బిజెపి ప్రజల్లోకి వెళ్ళగలిగింది.

జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడి దాదాపు 14 ఏళ్ళు అవుతుంది. కన్ని జార్ఖండ్ ఓటర్లు ఎప్పుడు కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు సరి కదా అన్ని ఆపద్దర్మ విధి నిర్వహణ ను కొనసాగించాయి.సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం మల్లి వాటిలో విబేధాలు రావటం.., ప్రభుత్వం పడిపోవటం, అవీనేతి ఆరోపణలు వాటిపై లెక్క లేనన్ని రావటం ఇవి అతి సాధారణంగా జార్ఖండ్ లో జరుగుతుండేవి. అందుకే జార్ఖండ్ రాష్ట్రములో ఏ అభివృద్ధి కళ్ళకు ఇంపాదిగా కనిపించదు. కానీ ఈసారి ఓటర్లు ఉన్నంతలో స్పష్టమైన తీర్పే ఇవ్వగలిగలిగారేమో. పద్నాలుగేళ్ల ఆ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఏ పార్టీకీ విస్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఇప్పుడు బీజేపీకి 37 స్థానాలు లభించడం మోదీ ప్రభంజనం వల్లనే అంటే నిజంగా అతిశయోక్తి కాదేమో. అయితే ఇంత ప్రభంజనంలో కూడా ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకొచ్చిన సీనియర్ నేత అర్జున్‌ముండా ఓడిపోయారు. ఆయన గతంలో మూడుసార్లు సీఎంగా వ్యవహరించారు. ఆయన పై కొన్ని అంతర్గత ఆరోపణలతోనే స్థానికంగా ప్రజలు ఆయన్ని తిరస్కరించారని తెలుస్తుంది. రాష్ట్రంలో ఇంతవరకూ తొమ్మిది ప్రభుత్వాలు ఏర్పడగా మూడు సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందంటే జార్ఖండ్ లో పరిస్థితి ని అర్ధం చేసుకోవచ్చు. కాని ఈ సారి బిజెపి మాత్రం పూర్తి ఆధిక్యతను ప్రదర్శించటం శుభ పరిణామమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ జార్ఖండ్ ప్రభుత్వ అస్థిరత తో విసిగిపోతున్న ప్రజలకు మోడీ మార్గ దర్శకత్వంలో కేంద్ర సహకారం తో సుస్థిర పాలన అను అందించాగాలరన్న నమ్మకం తోనే ప్రజలు బిజెపి కి పట్టం కట్టారని చెప్పవచ్చు.


బిజెపి రోజురోజుకు, బలంగా తన క్యాడర్ ను తయరు చేసుకుంటుంది ఉత్తరాన పాగా వేసిన బిజెపి ఇప్పుడు దక్షిణం పై కూడా తన దృష్టి ణి నిలిపిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే దక్షిణ భారత దేశం లోని రాష్ట్రాలలో తన ఆధిక్యాన్ని కనపరిచే అవకాశాలను కొట్టి పారేయలేమేమో.. ఇప్పటికే త్వరలో జరగనున్న తమిళ నాడు లో ఆపరేషన్ బిజెపి ఆకర్ష పేరు తో చాల మంది ప్రముఖులును ఆహావనిస్తున్న బిజెపి ఆ రాష్ట్రంలో కూడా ఎంతో కొంత ప్రభావాన్ని చుపిస్తుదేమో అంటే ఆశ్చర్య పడక్కర్లేదు. ఇదంతా మోడీ ప్రభంజనమే అయిన కొందరు పార్టీ అగ్ర నేతలను కూడా విస్మరించలేము. ఏది ఏమైనా ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపటం మార్పు కోరుకోవటమే అయిన.., బిజెపి ప్రజల ఆశలకు అనుగుణంగా, ఆశయాలకు అద్దంగా ప్రతిబింబించాల్సిన అవసరం ఎంతైనా ఉందేమో.


హరికాంత్ రామిడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : two state election results  jammu and kashmir  jarkhand  special story  

Other Articles