Us court dismisses 1984 rights violation case against congress

US court dismisses violation case, US court dismisses violation case, US court dismisses 1984 case, US court dismisses congress case, US court dismisses rights case, case mot touch and concern Us, case against congress dismissed, US court dismisses congress case, US court dismisses sikh riots case, indira gandhi, sonia gandhi, Newyork fedaral court

A federal appeals court has dismissed a 1984 Sikh rights violation case filed against Congress Party by a rights group, saying that the case does not sufficiently "touch and concern" the US.

అమెరికా కోర్టులో కాంగ్రెస్ కు ఊరట.. రైట్స్ గ్రూప్ పిటీషన్ కోట్టివేత

Posted: 12/21/2014 02:34 PM IST
Us court dismisses 1984 rights violation case against congress

కాంగ్రెస్‌ పార్టీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా పలువురు నేతలకు శరాఘాతంగా తయారైన మాజీ ప్రధాని ఇ:దిరాగాంధీపై మరణానంతరం చెలరేగిన ఘర్షణల కేసును అమెరికాలోని న్యూయార్క్ లోని రెండవ సర్క్యూట్ కోర్టు కొట్టి వేసింది. కాంగ్రెస్ పార్టీపై నమోదైన 1984 సిక్కు అల్లర్ల కేసును అమెరికా ఫెడరల్ న్యాయస్థానం కొట్టివేసింది. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన అల్లర్లకు కాంగ్రెస్‌పార్టీనే కారణమంటూ సిక్కుల న్యాయం కోసం పోరాడే సంస్థ 'సిక్కు ఫర్ జస్టిస్' పిటిషన్ వేసింది. పిటీషన్ ను విచారణకు స్వీకరిచంచిన న్యాయస్థానం పిటిషనర్లు చేసిన అభియోగాలతో అమెరికాకు సంబంధం లేదని పేర్కొంది.

ఆ అల్లర్లను కొందరు భారతీయుల మధ్య జరిగిన సంఘటనగా పేర్కొంటూ ఈ కేసుతో అమెరికాకు సంబంధం లేదని అమెరికా ఫెడరల్ కోర్టు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆధ్వర్యంలో జరిగాయాని, లేదా ఆయనే ఈ అల్లర్లకు కారణమని పిటీషనర్లు వాదించారు. అయితే ఈ కేసులోని ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనతో అమెరికాకు సంబంధముందని చెప్పడంలో పిటీషనర్లు పూర్తిస్థాయిలో ఆధారాలను చూపలేకపోయారంటూ న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై సిక్కు సంస్థ వేసిన కేసును కొట్టివేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US Second Circuit Court  1984 sikh riots case  dismisses  rights group  

Other Articles