Telangana to start hiring picks panel chief

Chief Minister K. Chandrasekhar Rao, appsc, tspsc,constitutinal body, tspsc job recruitment, tspsc administartion pannel

tealnagna publice service commission chairman Chief Minister K. Chandrasekhar Rao has finally approved the formation of the Telangana State Public Service Commission

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకం

Posted: 12/18/2014 10:23 AM IST
Telangana to start hiring picks panel chief

ఎట్టకేలకు తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రము విడిపోగానే చాల నిరుద్యోగ యువకులు ఉద్యోగాల ప్రకటనల కోసం ఎదురుచూశారు. తెలంగాణా ఉద్యమ సమయం నిరుద్యోగ యువకులే క్రియాశీలక పాత్ర పోషించారన్న విషయం తెలిసిందే.  కాని ఇన్ని రోజులుగా వారందరికీ ఉద్యోగాల ప్రకటనలు.., కేవలం ఊరించే ప్రకటనలుగానే మారాయి తప్ప.., ఇంతవరకు తెలంగాణా ప్రభుత్వం ఒక ఉద్యోగ ప్రకటన కూడా చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. కొందరికి వయసు పరిమితి కూడా అడ్డంకి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగుల క్రమబద్దీకరణ పై పలు విద్యార్ధి సంఘాలు భగ్గుమంటున్నాయి. మల్లి ఈ ఉద్యోగాల ప్రకటనలలో కూడా జాప్యం జరుగుతుండటం పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే నిరుద్యోగ  ఏది ఏమైనా నిరుద్యోగ యువకులు, ఉద్యోగాల ప్రకటనల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.  

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ చైర్మన్ గా ప్రముఖ విద్యావేత్త ఘంటా చక్రపాణి ని తెలంగాణా ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు ఉద్యోగ సంఘం నేత విటల్, మాజీ ఎం.ఎల్.ఏ చంద్రావతి, ఖాద్రి లను నియమించారు. ఆయితే మరో ఐదుగురి పేర్లను గవర్నర్ నరసింహన్ తిరస్కరించటం గమనార్హం. గతంలో సమాచార హక్కు చట్టం కింద కమిషనర్ల నియామకాల విషయం లోను గవర్నర్ అప్పుడు అభ్యంతరం చెప్పారు. కాగ చక్రపాణి తెలంగాణా ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. గతం లో జర్నలిస్ట్ గా ఉన్నారు. ఇటీవలి కాలంలో విశ్లేషకుడిగా కూడా ప్రాచుర్యం పొందారు.

హరి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles