Regular consumption of olive oil can improve heart health

Regular consumption, olive oil, improve, heart health, heart attack, Universities of Glasgow and Lisbon, Mosaiques Diagnostics in Germany, phenolics, natural compounds, monounsaturated fatty acids, protective effect

Regular consumption of olive oil can improve heart health

హృద్రోగాలకు.. దివ్యౌషధం.. గుండె మెరుగవుతుందట..

Posted: 11/22/2014 01:26 PM IST
Regular consumption of olive oil can improve heart health


గుండె జబ్బులతో బాధపడుతున్నారా..? అయితే క్రమం తప్పకుండా ఆలివ్ నూనెను తీసుకొండి. నిజంగానే ఆలివ్ నూనెతో గుండె జబ్బులను క్రమంగా దూరం చేసుకునే అవకాశం వుందని అధ్యయానాలు స్పష్టం చేస్తున్నాయి. ఆలివ్ నూనెతో గుండె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని.. గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆలివ్ నూనె ప్రభావంపై గ్లాస్గో, లిస్బన్ విశ్వవిద్యాలయాలు.. జర్మనీలోని మొజాయిక్స్ డయాగ్నస్టిక్స్ పరిశోధకులు అధ్యయనం చేశారు.

ఆలివ్‌లతో పాటు వృక్షాల్లో కనిపించే సహజ రసాయనాలైన ఫెనోలిక్స్ గుండె ఆరోగ్యం మీద చూపే ప్రభావాన్ని ఇందులో పరిశీలించారు. పరిశోధకులు గుండె జబ్బులతో బాధపడే 69 మందిని ఎంచుకుని రెండు బృందాలుగా విభజించారు. ఒక బృందానికి ఫెనోలిక్స్ అధికంగా గల.. రెండో బృందానికి ఫెనోలిక్స్ తక్కువగా గల ఆలివ్ నూనెను రోజుకు 20 ఎం.ఎల్ చొప్పున ఆరు వారాల పాటు తీసుకోవాలని సూచించారు. అయితే రెండు బృందాలలో గుండెజబ్బును పట్టించే సూచికలు చాలావరకు తగ్గినట్టు తేలింది.

రోగుల మూత్రాన్ని పరీక్షించిన వైద్యులు.. అందులో గుండె జబ్బులకు కారణమన ప్రోటీన్లు మూత్రము ద్వారా విడుదలైనట్లు గుర్తించారు. ఇవి హృదయ ధమనుల వ్యాధితో పాటు దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధిని కారణమయ్యే బయోమార్కర్ పెప్టిడెస్ ను విచ్చినం చేసి బయటకు పంపుతుందని కనుగొన్నారు. ఫెనోలిక్ మోతాదులతో సంబంధం లేకుండానే ఈ ప్రభావం కనబడుతోందని పరిశోధకుల బృంద సభ్యులతో ఒకరైన గ్లాస్ కో యూనివర్శిటీ వైద్య విభాగం సంచాలకులు డాక్టర్ ఎమిలీ కాంబెట్ తెలిపారు. తమ అధ్యయనాలలో గుండె ధమనులకు సంబంధించిన వ్యాధులు ఆలివ్ నూనెతో తగ్గుముఖం పడుతున్నాయని, క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుందని తేలిందని చెప్పారు.

అలివ్ నూనెతో వంటకాలు చేసుకుని తినే వారిలో గణనీయంగా గుండెజబ్బులు తగ్గుతాయని చెప్పారు. గుండెపై అలివ్ నూనె ప్రభావాన్ని చూపుతుందని, దీని ద్వారా గుండె జబ్బులను దూరం చేసుకోవడమే కాకుండా, గుండె అగిపోవడాన్ని కూడా నియంత్రచ్చవచ్చని తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles