No party may get majority in jammu and kashmir bjp to emerge on top in jharkhand surveys

BJP, Prime Minister, Narendra Modi, Jammu and Kashmir, National Conference, Jharkhand, PDP, JMM, Congress, Majority, ABP News-Nielsen, LJP-AJSU, RJD and JD(U), PM

No party may get majority in Jammu and Kashmir, BJP to emerge on top in Jharkhand: Surveys

జమ్మూ, జార్ఖండ్లలోనూ కాంగ్రెస్ కు పరాభవం తప్పదా..?

Posted: 11/22/2014 11:35 AM IST
No party may get majority in jammu and kashmir bjp to emerge on top in jharkhand surveys

జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, అసెంబ్లీ ఎన్నికలలోనూ యూపీఏ ప్రభుత్వ కూటమి పార్టీలకు పరాభవం తప్పేట్లు లేదు. జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ లలో కాంగ్రెస్ మూడు, నాలుగు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ 25 నుంచి ఐదు విడతలుగా జరగనున్న జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అధికారాన్ని పంచుకున్న చోట కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మరీ దిగజారిపోతోంది కాంగ్రెస్.

కాగా జమ్మూకశ్మీర్‌ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన ఆధిక్యత దక్కదని ఒక వార్తా ఛానల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఝార్ఖండ్‌లో బీజేపి ఆధిక్యత సాధించే అవకాశం ఉందని వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌లో హిందీ ఛానెల్ 'న్యూస్ నేషన్ ఇండియా' అభిప్రాయ సేకరణ జరిపింది. 87 శాసనసభ స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో ఏ పార్టీకి సరైన ఆధిక్యత దక్కదని సర్వేలో వెల్లడైంది. పీడీపీ 31-36 స్థానాలను గెలుచుకుని మొదటి స్థానంలో నిలవవచ్చని, బీజేపికి 23-28 స్థానాలు దక్కవచ్చని తెలిపింది. అధికార నేషనల్ కాన్ఫరెన్సుకు 7-11 స్థానాలు, కాంగ్రెస్‌కు 8-12 స్థానాలు దక్కవచ్చని పేర్కొంది.

అటు ఝార్ఖండ్‌లో బీజేపికి ఆధిక్యత లభించే అవకాశం ఉందని వెల్లడైంది. 81 శాసనసభ స్థానాలున్న ఝార్ఖండ్‌లో 42-46 స్థానాలు బీజేపి దాని మిత్రపక్షాలైన ఎల్జేపి, ఎజేఎస్యూలు దక్కించుకోనున్నాయని వెల్లడించింది. జేఎంఎంకు 18 స్థానాలు లభించే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు జేడీ యు, ఆర్జేడీలు కలసి 12 నుంచి 14 స్థానాలను దక్కించుకునే అవకాశాలు వున్నాయిని తెలిపింది. కాగా మరో మీడియా సంస్థ ఏబీపీ న్యూస్-నీల్సన్ చేపట్టిన సర్వేలో బీజేపి దాని కూటమి పక్షాలైన ఎల్జేపీ-ఏజేఎస్‌యూలకు 37 స్థానాలు దక్కే అవకాశం ఉందని వెల్లడైంది. బీజేపి సొంతంగా 30 స్థానాలను గెలుచుకుంటుందని తేలింది. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీ(యూ)లకు అన్ని కలిపి 23 స్థానాలు దక్కవచ్చని పేర్కొంది. ఏబీపీ న్యూస్ సర్వేలో పాల్గొన్నవారిలో 80శాతం మంది ప్రధానమంత్రి పనితీరు భేషుగ్గా ఉందని కితాబిచ్చారు.

అయితే పదేళ్ల పాటు అదికారంలో వున్న జాతీయ పార్టీని.. ప్రజలు ఎందుక అంతలా చీదరించుకుంటున్నారు... ఎందుకు దూరం పెడుతున్నారు అన్న విషయాలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారంచాల్సిన అవసరం ఎంతైనా వుంది. కాంగ్రెస్ కార్యర్తలల్లో నూతనోతేజం వచ్చేలా ప్రణాళికలు రచించాల్సి వుంది. విమర్శలతో విరుచుకుపడటం కంటే.. తాము దేనికి నాంది పలుకుతామన్న విషయమై దృష్టిని కేంద్రీకరించాల్సి వుంది. తాతలు తాగిన నెయ్యి వాసన మన వద్ద రాదన్న నగ్న సత్యాన్ని గ్రహించాలి. ఎవరు ఎం చేశారన్నది పక్కన బెడితే.. తామేం చేస్తామన్నది ముఖ్యమని తెలుసుకోవాలి. అలా కాకుండా నాయకత్వ మార్పుతోనే అంతా జరిగిపోతుందను కోవడం కూడా పోరబాటే. ప్రభుత్వ వ్యతిరేకతే తమకు కలసి వస్తుందన్న పగటి కలలను కూడా దూరం పెట్టాల్సిన అవసరముంది. అవినీతి ఏ కోణాన జరగనివ్వమని స్పష్టమైన హామీని ప్రజలకు ఇవ్వాలి. అలా నడుచుకోవాలి. అప్పడే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles