A girl walks around delhi for 10 hours get mixed response

Women, Walks, Delhi, Mumbai, 10 Hours, Prove, safe, india, All Men Are Not The Same, New York, Pune, same result, good news, harrasement, Woman walks in Delhi, sexual harassment, street harassment, hollaback, shoshana roberts

A Girl Walks Around delhi For 10 Hours, get mixed response

ఢిల్లీలో మహిళలకు నిత్యం వేధింపులే..

Posted: 11/21/2014 11:00 PM IST
A girl walks around delhi for 10 hours get mixed response

దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు అంత సురక్షితమైన నగరం కాదని తేలింది. ఢిల్లీ నగరం కూడా రమారమి న్యూయార్క్ సిటీ తరహాలో వుందని స్పష్టం అవుతోంది. అభివృద్దిలో అనుకుంటే.. పొరబాటే.. అమ్మాయిలను వేదించడంలో. ఇటీవల అమెరికా నగరంలో న్యూయార్క్ సిటీలో ఓ సినీనటి 10 గంటల పాటు జనారన్య ప్రాంతంలో నడిస్తే ఎలా వుంటుంది. అమెకు ఎదురయ్యే అనుభవాలు ఏంటీ.. ఇలాంటి ఘటనలు అమ్మాయిలందరూ ఎదుర్కోంటున్నారా అన్న కోణంలో సిక్రెట్ కెమెరాతో అన్ని ఘటనలను అందులో బంధించారు. అయితే న్యూయార్క్ నగరం మహిళలకు అంత సురక్షితం కాదని తేలింది. ఈ నగరంలో జరుగుతున్న వేధింపులపై పిర్యాదులు వెల్లువెత్తడంతో ఓ సినీ నటి సహకారంతో అమ్మాయిలు పడుతున్న వేధింపుల బట్టబయులు చేసింది ఓ స్వచ్చంధ సంస్థ.

న్యూయార్క్ నగరంలో మహిళల ఇబ్బందులను వీడియోను ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షించడంతో.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై నగరంలో మహిళలకు ఎంత మేరకు రక్షణ ఉందన్న విషయమై  సరిగ్గా అలాంటి కార్యక్రమాన్నే రంబుల్ అనే సంస్థ చేపట్టింది. ఓ మోడల్ ను 10 గంటల పాటు ముంబైలోని జనసాంధ్రత కలిగిన  ప్రాంతాల్లో తిప్పితే ఎలా వుంటుందని పరీక్షించాలనుకున్నారు. అభివృద్ది చెందిన అగ్రరాజ్యానికి పూర్తి భిన్నంగా ఓ మోడల్.. షాట్ స్కర్ట్, టాప్ తో డ్రెసింగ్ చేసుకుంది. అలా ముంబైలోని అందేరి, దాదర్ ఈస్ట్, బంద్రా, కుర్లా, మెరైన్ డ్రైవ్, ఫోర్ట్ మార్కెట్, సీఎస్ టీ, తదితర వీధులన్నీ నడుచుకుంటూ తిరిగింది. అయితే ఎక్కడా ఎవరూ కూడా ఈ మోడల్ ను కామెంట్ చేయలేదు. అసలు ఒక్క అకతాయి కూడా ఈమె దరికి రాలేదు. భిన్న సంస్కృతులకు నిలయమైన భారత్ లో మహిళలకు సముచిత స్థానం వుందనడానికి ఇది నిదర్శనం అనుకుంటున్న తరుణంలో మరో ప్రయోగానికి సిద్దమయ్యారు.

దేశ రాజధాని ఢిల్లీలో మరో మోడల్ తో చేసిన ప్రయోగం నిర్వాహకులను విస్మయానికి గురి చేసింది. ఢిల్లీలో దేశాన్ని పాలించే పాలకులు వున్న చోట, ప్రభుత్వ పాలనను దేశవ్యాప్తం చేసే అధికార యంత్రాగం వున్న చోట, రాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్రమంత్రులు, ఎంపీలకు నెలవైన ప్రాంతంలో అడవారికి నిత్యం వేధింపులే. నిర్భయ ఘటనతో వెలుగు చూసిన దారుణకృత్యాలు.. ప్రభుత్వం మారినా, పాలకులు మారినా.. కొనసాగుతూనే వున్నాయి. పాశ్చత సంస్కృతి మోజులో కొట్టుమిట్టాడుతున్న యువతం అమ్మాయిలను వేధించడం, కవ్వింపులకు పాల్పడటం కూడా వికృత చర్యలని తెలుసుకోలేక పోతోంది.

ఢిల్లీలోని వివిధ జనసాంధ్రత కలిగిన ప్రాంతాల్లో 10 గంటల పాటు నడిచిన మోఢల్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దారి పోడవునా అమెకు అకతాయిలే ఎదురయ్యారు. ఒకానోక దశలో ఓ కుర్రాడు మోడల్ చెయ్యి పట్టుకున్నాడు. మరో యువకుడు అమెను తాకి సంబరపడ్డాడు. కొద్ది దూరం వారు మోడల్ ను వెంబడించారు. అయినా స్పందించకుండా నడుస్తున్న మోడల్ వెనక ఎక్కువ దూరం నడవలేక అగిపోయారు. పలువురు పలు రకాలుగా కామెంట్లు చేశారు. ఓ యువకుడు తాను భారతీయురాలేనా.. అంటూ అడిగాడు. మొత్తానికి నిత్యం వేధింపులకు ఓర్చుకుని ధైర్యంగా, తమను తాము రక్షించుకుంటూ, సహనంతో జీవినాన్ని సాగిస్తున్న ఢిల్లీ మహిళలకు జైజైలు పలకాలి.

యత్ర నార్యంతు పూజ్యంతే, తత్ర రమ్యంతే దేవతాం అంటూ అడవారిని పూజించే సంస్కృతి దాగివున్న మన దేశంలో, అందులోనూ రాజధాని నగరంలో మహిళలపై అకృత్యాలు, వేధింపులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మన అడపడచులే కదా అని కూడా అలోచించకుండా.. నా తోడబుట్టినది కాదు కదా.. అంటూ వెళ్తే భారతీయత కనుమరుగవుతుంది. భారతీయులందరూ నా సోదర సోదరీ మణులు అనుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Women  Walks  Delhi  Mumbai  10 Hours  Prove  safe  india  All Men Are Not The Same  New York  Pune  same result  good news  harrasement  

Other Articles