Ajmer a perfect example of shia sunni harmonious living

Ajmer, perfect example, harmonious living, oldest inhabitants, Sunni and Shia, India, tolerance, Muslim, incidents, violence, Peace, harmony, separate routes, ceremonies Taragarh hill, Khwaja Moinuddin Chisti.shrines

Ajmer, a perfect example of Shia-Sunni harmonious living

సామరస్యానికి ప్రతీక 800 ఏళ్ల నాటి అజ్మీర్..

Posted: 11/05/2014 07:13 PM IST
Ajmer a perfect example of shia sunni harmonious living

భారత దేశంలోని అజ్మీర్ మత సామరస్యానికి, సౌభ్రాభృత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. పురాతన శాంతియుత పద్దతుల, సహనానికి అలంభనకు, ఆలవాలంగా నిలస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం మత చాంధసవాదులు అధికమవుతున్న తరుణంలో.. మరో వైపు షియా- సున్నీ మహ్మదీయ సోదరుల మధ్య వివాదాలతో అట్టుడికిపోతుంటే.. అజ్మీర్ మాత్రం అందుకు భిన్నంగా సహనానికి ప్రతీకైన నగరంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు అజ్మీర్ లో మహ్మదీయ వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోలేదని, చిన్న స్థాయిలో కూడా తాము హింసాత్మక ఘటనలు చూడలేదని  అక్కడి మత  పెద్దలు చెబుతున్నారు. షియాలు సున్నీలకు మధ్య పలు సందర్భాల్లో మహరం పండగను పురస్కరించుకుని గొడవలు జరుగుతుంటాయి.

అయితే తమ అజ్మీర్ లో మాత్రం షీయాలు, సున్నీల మధ్య ఎలాంటి విద్వేషాలు లేవని, ఇద్దరి మధ్య ఎలాంటి తారతమ్య బేధం లేకుండా కలసిమెలసి వుంటామని అజ్మీర్ వాసులు చెబుతున్నారు. అంతేకాదు మోహర్రం పండుగను షియాలతో తాము కలిసి జరుపుకుంటామని సున్ని సభ్యుడు ముజాఫర్ భారతి చెప్పారు. యావత్ భారత దేశంలోనే అజ్మీర్ ప్రాంతం సున్నీ-షియా ముస్లింలు కలసి వుంటున్న అతి పురాతన ప్రాంతంగా కీర్త గడించిందని చరిత్ర పుటలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అజ్మీర్ లో ఇరువర్గా ముస్లింలు సోదరబావంతో మెలుగుతారని చెప్పారు. ఇక్కడ తామెప్పుడూ ఏ విషయంలోనూ గోడవలకు, హింసలకు పాల్పడలేదన్నారు. పురాతనానికి గౌరవాన్ని ఇస్తూ.. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు.

తాజయా ఊరేగింపులు లంగర్ ఖానా, ఖాదిం మోహల్లా, అంధర్ కోట్ తదితర ప్రదేశాల్లో మీదుగా జరుగుతుందని తరువాత తారాఘర్ వద్ద సమాధి అవుతుందని చెప్పారు. మహమ్మద్ ఇర్పాన్.. షియా  వర్గానికి చెందిన ఒ మత పెద్ద కూడా భారతి తరహాలోనే అభిప్రాయాలను వెల్లడించారు. మోహర్రం పండుగను చేసుకోవడం ప్రవిత్ర కార్యంగా చెప్పుకోచ్చారు. కర్బాలా యుద్దంలో ముస్లి ప్రవక్త మహమ్మద్ మనవడు మరణాన్ని గుర్తు చేసుకుంటూ, వారికి అంజలి ఘటించేందుకే మహమదీయులు మెహర్రం పండగను ఆచరిస్తారని చెప్పారు.

అజ్మీర్ జిల్లాలో షియాలు, సున్నీల మధ్య మంచి సోదరభావం వుందని, వారు ఎప్పుడు ఒకరితో మరోకరు గొడవపడ్డ దాఖలాలు లేవని ఆ జిల్లా ఎస్పీ మహేంద్ర సింగ్ తెలిపారు. ఇరు వర్గాలు శాంతియుతంగా, సామరస్యంతో మెలుగుతాయని చెప్పారు. వారి మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా వేడుకలు, ఊరేగింపుల సమయంలో వారు వేర్వేరు మార్గాల్లో.. ఉత్సవాలను నిర్వహిస్తుంటారని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి మందిరం వద్ద  సున్నీలు నివాసాలు వుంటే.. తారాఘర్ పర్వతాలపైన షియాల నివాసాలు ఉండటం కూడా వీరిలో ఘర్షణాత్మక వైఖరికి పాల్పడకుండా దోహదపడిందని ఎస్పీ మహేంద్ర సింగ్ అన్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles