Private companies say economic reforms are on slow track

private companies, economic reforms, slow track, PM narendra modi, India, Private Firms

private companies say economic reforms are on slow track

ఆర్థిక సంస్కరణలపై ప్రైవేటు సంస్థల సన్నాయి నోక్కులు..

Posted: 10/24/2014 09:57 AM IST
Private companies say economic reforms are on slow track

గత ఎన్నికల ముందు గుజారాత్ అభివృద్దిని. ఆర్థిక పురోగతిని దేశ ప్రజలకు చూపిన ప్రధాని నరేంద్రమోడీ.. ఇప్పడు దేశవ్యాప్తంగా అదే తరహా వెలుగులు నింపాలని యోచిస్తున్నారు. అందుకు ఆర్థికాభివృద్ధిని పరుగులెత్తించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రైవేటీకరణే మార్గమని ప్రవచిస్తున్న ప్రధాని, ఆర్థిక సంస్కరణలపై దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా పారిశ్రామిక వర్గాలు, ప్రైవేటు గుత్త సంస్థల కోర్కెలు తీర్చేందుకు భారీ నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఒక్కవారంలోపే డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేత, కార్మిక చట్టాల సరళీకరణ, ప్రైవేటు సంస్థలకు బొగ్గు మైనింగ్ అవకాశం తదితర నిర్ణయాలతో ప్రపంచ పెట్టుబడి శక్తులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

అయినా పారిశ్రామిక వర్గాలు పెదవి విరుస్తున్నాయి. సంస్కరణలు నత్తనడకన సాగుతున్నాయని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాల్లో ప్రభుత్వం చాలా నిదానంగా పనిచేస్తున్నదని విమర్శిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాలపై దూకుడుగా వెళ్లేముందు రాజకీయ పరిణామాలను కూడా గమనించాలని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. లోక్‌సభలో తమకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో ప్రతిపక్షాలదే పైచేయి అని, ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణలపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.

సంస్కరణల్లో మరింత వేగం పెంచటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటున్నాయి. డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తేసి భారీ సబ్సిడీ భారాన్ని వదిలించుకున్నామని, కార్మిక చట్టాలను సరళీకరించి ఈ అంశంలో ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం 134వ స్థానంలో ఉన్న భారత్‌ను మరింత కార్మిక సరళీకరణ దేశంగా మార్చనున్నామని, బొగ్గును వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసుకుందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతిచ్చామని గుర్తు చేస్తున్నాయి.

మరోవైపు అతిపెద్ద ప్రభుత్వరంగ చమురు సంస్థ ఓఎన్జీసీలో ఐదుశాతం వాటా విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వాటా విక్రయం ద్వారా దాదాపు రూ.18,300 కోట్లు సమకూరే అవకాశముంది. ఆ సొమ్ముతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన ద్రవ్యలోటును పూడ్చుకోవాలని భావిస్తున్నది. కార్మిక చట్టాల సరళీకరణపై ప్రైవేటు కంపెనీలు ఇంకా సంతృప్తి చెందకపోవటంతో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బ్రిటీష్ కాలంనాటి 300 కార్మిక చట్టాలను రద్దుచేయాలని చూస్తున్నది. ఈ నిర్ణయాల ద్వారా విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తాయని మోదీ సర్కారు గంపెడాశతో ఉన్నది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : private companies  economic reforms  slow track  PM narendra modi  India  Private Firms  

Other Articles