Ganga river cleaning giving good results to aquatic life

ganga river pollution, ganga river cleaning, ganga river water, ganga river floating, narenra modi on ganga, birds at rivers, birds migration, latest news, uttarpradesh news, rivers in india, water pollution, aquat

ganga river cleaning giving good results to aquatic life : the river ganga cleaning operation giving good results with the cleaning process birds and river based birds coming towards ganga water also temperature of the river becoming down by 1-2 degrees and transparency of the water increased by 1.5times

గంగ శుధ్దితో వస్తున్న మంచి ఫలితాలివే

Posted: 10/24/2014 10:12 AM IST
Ganga river cleaning giving good results to aquatic life

కాలుష్య కాసారంగా మారిన పవిత్ర గంగానది పారిశుధ్యం కోసం చేపట్టిన ప్రాజెక్టు సత్ఫలితాలను ఇస్తోంది. కేంద్రం చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టు ఆరంభంలోనే సత్ఫలితాలను ఇస్తోంది. గంగ పరివాహక ప్రాంతంలో శుద్ధికి ముందు.., శుద్ధికి తర్వాత వస్తున్న మార్పులపై దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు.  ఒకప్పుడు పక్షులకు ఆలవాలంగా నిలిచిన ఈ నదీమతల్లి ఒడిలోకి ఆ తర్వాత పక్షులు రావాలంటేనే భయపడేవి. కాని కేంద్రం చేపట్టిన శుద్ధి ప్రాజెక్టుతో గంగా నదీ నీటిలో మార్పులు వచ్చాయి. దీంతో పక్షులు కూడా తిరిగి రావటం మొదలు పెట్టాయని పరిశోధకులు తెలిపారు.

అంతేకాకుండా నదిలో స్వచ్ఛత పెరిగిందని కూడా వెల్లడించారు. నీటి పారదర్శకత రేటు ఒకప్పుడు 18సెంటిమీటర్లుగా ఉంటే ఇప్పుడు అది 30సెంటమీటర్లకు పెరిగిందని వెల్లడించారు. అంటే నీటిలో 30సెంటీమీటర్ల లోతు వరకు నీరు స్వచ్ఛంగా కన్పిస్తుంది అన్నమాట. గంగానదిలో గతంతో పోలిస్తే ఇది చాలా గొప్ప విషయం. అటు నది పరివాహక ప్రాంతంలో వాతావరణం కూడా 19డిగ్రీల నుంచి 18.1డిగ్రీలకు చేరిందని చెప్తున్నారు. దీంతో పాటు నదిలో క్లోరైడ్ శాతం కూడా లీటర్ కు 26మిల్లీ గ్రాము నుంచి లీటర్ కు 16మిల్లీ గ్రాముకు తగ్గిందని పరిశోధకులు తేల్చిచెప్తున్నారు. ఆరంభంలోనే ఈ విధమైన మార్పులు ఉంటే..., పూర్తిగా శుద్ధి జరిగితే గంగకు పునర్వైభవం రావటం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోనే అతిపెద్ద జీవనదిగా ఉన్న గంగ 2,525కిలోమీటర్లు ప్రవహిస్తోంది. హిమాలయాల్లో చిన్న పాయగా మొదలై చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిని అత్యంత పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. నదీలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని నమ్మకం. అంతేకాకుండా నదిలో అస్తికలు కలిపితే చనిపోయినవారికి స్వర్గం ప్రాప్తిస్తుందని ప్రజల విశ్వాసం. ఈ కారణంగా నదిలో అస్తికలు కలపటం పెరగటంతో పాటు నది పక్కనే దహన సంస్కారాలు జరిగేవి. ఇలా చేయటం వల్ల నది కలుషితం అయింది. దీనికి తోడు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు కాలుష్యం, వ్యర్థాలను నేరుగా నదిలోకి వదిలేవి. ఫలితంగా స్వచ్ఛమైన గంగానది నీరు కాస్త కలుషితంగా మారింది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నదుల్లో గంగ కూడా ఉంది. దీంతో నది ప్రక్షాళనకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టి నిధులు విడుదల చేస్తోంది. ఫలితంగా నీరు తిరిగి స్వచ్ఛంగా మారుతోంది.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : ganga  cleaning  aquatic life  latest news  

Other Articles