Husband made his wife nude in public walk in nizamabad

sadist husbands, husbands sadism, sadist wife, sadist behaviour towards others, nude women, telugu nude women, nizamabad news, latest telugu updates, telangana latest updates, husband and wife relationship

husband made his wife nude in public walk in nizamabad : a sadist husband made his wife nude and walked her in public for refusing to sell articles in home for money polie arrested him and women organisations demanding to punish seviourly the sadist husband

భార్యను బట్టలు విప్పి ఊర్లో తిప్పిన భర్త

Posted: 10/22/2014 11:21 AM IST
Husband made his wife nude in public walk in nizamabad

కట్టుకున్న భర్తే కిరాతకుడు అయ్యాడు. భార్యకు రక్షణగా నిలవాల్సిన మొగుడు.., మృగంలా మారి ఆమె పరువును బజారుకీడ్చాడు. చెప్పినపని చేయనందుకు భార్యను బట్టలు విప్పి బజారులో తిప్పాడు. ఈ దారుణం నిజామాబాద్ లో జరిగింది. బాధితురాలి కధనం ప్రకారం, స్థానికంగా నివసించే ఓ శాడిస్టు భర్త తాగివచ్చి నిత్యం భార్యను వేధించేవాడు. డబ్బులు కావాలని.., ఇవ్వలేదంటే చిత్రహింసలు పెట్టేవాడు. ఆ క్రమంలోనే తాజాగా డబ్బులు కావాలని అడిగితే భార్య లేవు అని చెప్పింది.

దీంతో ఇంట్లోని సామాన్లు అమ్మేసి డబ్బులు తీసుకురమ్మని ఆదేశించాడు. అయితే కష్టపడి కొనుక్కున్న వస్తువులు అమ్మేందుకు మహిళ నిరాకరించింది. దీంతో తాను చెప్పిన మాటకే ఎదురుచెప్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను ఎదిరించటంతో సరైన బుద్ది చెప్తానంటూ.. భార్య బట్టలు విప్పదీశాడు. బజారులో అందరూ చూస్తుండగా.., నగ్నంగా బయట తిప్పాడు. మాంసం నరికే కత్తి చేత పట్టుకుని అడ్డుచెప్పటానికి వచ్చిన వ్యక్తులను నరుకుతాను అంటూ బెదిరించాడు.

video courtesy : INI News

ఆ దారుణంపై స్థానికులు పోలిసులకు ఫిర్యాదు చేయగా.., స్పందించిన పోలిసులు శాడిస్టు భర్తను అదుపులోకి తీసుకున్నారు. అయితే తన భార్యను బట్టలు విప్పించాను కాని తాను ఏ తప్పు చేయలేదు అని నిందితుడు దర్జాగా తప్పును సమర్ధించుకున్నాడు. తన భర్త ఆగడాలు.., ఆకృత్యాలపై బాధిత భార్య రోదిస్తూ మీడియాకు వివరాలు వెల్లడించింది. అటు శాడిస్టు భర్తను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sadist husband  wife  nude  nizamabad  

Other Articles