India re elected to the un human rights council for 2015 17 pm express joy

Asia-Pacific group, Asoke Mukerji, General Assembly, India, NewsTracker, UN, UN Human Rights Commission, UNHRC, United Nations, World, PM Modi

India re-elected to the UN Human Rights Council for 2015-17, PM express joy

ఐక్యరాజ్య హెచ్ఆర్సీకి రెండోసారి ఎంపికైన భారత్

Posted: 10/22/2014 11:08 AM IST
India re elected to the un human rights council for 2015 17 pm express joy

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్ఆర్‌సీ)కి భారత్ తిరిగి ఎన్నికైంది. ఐరాస సర్వప్రతినిధి సభలో జరిగిన ఎన్నికల్లో ఈ కీలక విజయం సాధించింది. 47 దేశాలుండే ఈ మండలిలో భారత్ ప్రస్తుత పర్యాయం ఈ ఏడాది డిసెంబరు 31తో ముగియనుంది. మళ్లీ ఎన్నికవడంతో 2017 చివరి వరకు కొనసాగనుంది. ఆసియా-పసిఫిక్ గ్రూప్‌లో అత్యధికంగా భారత్ 162 ఓట్లు పొందింది. ఈ గ్రూప్‌కు సంబంధించి నాలుగు ఖాళీలు ఉండగా, వీటికి భారత్‌తోపాటు బంగ్లాదేశ్, ఖతార్, ఇండోనేషియా ఎన్నికయ్యాయి. ఏదైనా దేశం మండలిలో వరుసగా రెండు పర్యాయాలు సభ్యురాలిగా ఉన్న తర్వాత మళ్లీ సభ్యత్వం కోసం వెంటనే పోటీపడేందుకు నిబంధనలు అనుమతించవు.

భారత్ తన నిబద్దతతో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి వ్యవస్థను బలపరుస్తూ.. బలోపేతానికి కృషి చేస్తుంది. భారత్ దేశీయంగానే కాకుండా విదేశీ వ్యవహారాలలోనూ పలు దేశాల దైపాక్షిక సంబంధాలలోనే మానవ హక్కులకు అనుగూణంగా ఒప్పందాలు చేసుకుంది. దీంతో మానవ హక్కులకు భారత్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చని, మానవ హక్కుల విస్తరణతో పాటు రక్షణ కోసం కూడా భారత్ పాటుపడుతుందని భారత్ తన ప్రకటనలో తెలిపింది.

భారతదేశానికి ఐక్యరాజ్యసమితీలో శాశ్వత సభ్యత్వం కల్పించేందు ఐక్యరాజ్య సభ్యదేశాల కృషిని కూడా శ్లాఘించింది. ఐక్యరాజ్య మానవహక్కుల మండలిలో మరోమారు భారత్ స్థానం సంపాదించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ నిబద్దతను, చిత్తశుద్దిని నమ్మి.. మరోమారు సభ్యత్వం కల్పించేందుకు ఓట్లు వేసి గెలిపించిన దేశాలన్నింటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles