Bcci suspends bilateral tours with wi to take legal action

west indies, team india, BCCI, suspend, bilateral tours, legal action, shivlal yadav, president, Hyderabad

BCCI suspends bilateral tours with WI, to take legal action

విండీస్ టూర్లన్నీ రద్దు, క్రికెట్ బోర్డుపై చర్యలు: బీసీసీఐ

Posted: 10/21/2014 07:31 PM IST
Bcci suspends bilateral tours with wi to take legal action

హైదరాబాదులో బీసీసీఐ కార్యవర్గ సమావేశం ప్రారంభమయింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్దమైంది. అంతే కాదు విండీస్ లో జరిగే టూర్లను బీసీసీఐ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై తీవ్ర తర్జన భర్జనలు పడిన అనంతరం బీసీసీఐ ఎట్టకేలకు విండీస్ టూర్లను రద్దు చేసున్నట్లు స్పష్టం చేసింది. వెస్టిండీస్ తో అన్ని ద్వైపాక్షిక టూర్లను రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ బోర్డు తెలిపింది. భారత్ లో పర్యటనను విండీస్ అర్ధాంతరంగా టూర్ రద్దు చేసుకుని స్వదేశానికి పయనం కావడంతో వివాదం చెలరేగింది.

భారత్ లో పర్యటనను విండీస్ అర్ధాంతరంగా టూర్ రద్దు చేసుకుని స్వదేశానికి పయనం కావడంతో వివాదం చెలరేగింది. వెస్టిండీస్‌ టూర్ లో 3 టెస్ట్‌లు, 5 వన్డేలు, 2 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.  వెస్టిండీస్‌ టూర్‌ రద్దుపై  హైదరాబాద్‌లో బీసీసీఐ ప్రెసిడెంట్‌ శివలాల్‌ యాదవ్‌ అధ్యక్షతన వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది  ఈ టూర్‌ రద్దుతో బీసీసీఐకి భారీ నష్టాలు వాటిల్లాయి. వెస్టిండీస్‌ టూర్‌ రద్దుతో మొత్తం 17 రోజుల లైవ్‌ క్రికెట్‌ రద్దయింది.

వేతనాల విషయంపై తమ బోర్డుతో విభేదించిన విండీస్ ఆటగాళ్లు సిరీస్ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. దీంతో, బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లింది. టూర్ షెడ్యూల్ ను శ్రీలంకతో భర్తీ చేసుకున్నప్పటికీ... బీసీసీఐకి భారీగానే నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని విండీస్ బోర్డ్ నుంచి రాబట్టేందుకు బీసీసీఐ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : west indies  team india  BCCI  suspend  bilateral tours  legal action  shivlal yadav  president  Hyderabad  

Other Articles