Islamic state of iraq and syria isis group killed hama pravins woman with stone for doing prostitution

islamic state, isis militants, isis militants killed woman prostitution, islamic state of iraq and syria, isis group militants, father killed daughter with stones, people killed prostitution woman with stones

islamic state of iraq and syria isis group killed hama pravins woman with stone for doing prostitution

వ్యభిచారం చేసిందని.. అత్యంత దారుణంగా చంపేశారు!

Posted: 10/21/2014 08:06 PM IST
Islamic state of iraq and syria isis group killed hama pravins woman with stone for doing prostitution

ఆమధ్య పాకిస్తాన్ లో ఒక మహిళ వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆమెను అందరూ చూస్తుండుగానే తన చేతిలో వున్న తుపాకీని కాల్చి చంపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ చలించేసింది! అలాగే బురఖా వేసుకోకుండా బజారులో తిరుగుతున్నందుకు ఒక మహిళను ఆమె భర్త నడిరోడ్డు మీద 100 కొరడా దెబ్బలు కొట్టిన ఘటన సంచలనం రేపింది. అంతెందుకు... ఒక మహిళ కేవలం సెల్ ఫోన్ వాడుతోందని నెపంతో ఆమెను ఇంటినుంచి బయటకు కొట్టుకుంటూవచ్చి తన కుటుంబసభ్యులతోపాటు ఇతరులు చూస్తుండగానే కాల్చి చంపేశాడు. ఇదీ.. ఇస్లామిక్ దేశాల్లో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు! ఇవి మాత్రమే కాదు.. ఇంకా బయటికి రాని సంఘటనలు కోకొల్లలు! నిజానికి ఇస్లామిక్ ఆచారాల ప్రకారం మహిళలకు కొన్ని సంప్రదాయాలు పాటించాల్సి వుంటుంది కానీ.. మరి వారిని స్వేచ్ఛను హరించి, దారుణంగా శిక్షించడం మాత్రం చాలా అన్యాయమంటూ మహిళాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలావుండగా.. తాజాగా అటువంటి తరహాలోనే మరో ఘటన చోటు చేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు అసలు చూడటానికి ధైర్యం చేయలేని దారుణానికి ఒడిగట్టింది. మధ్య సిరియాలోని హమా ప్రావిన్స్ కు చెందిన ఓ మహిళ వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశారు. అందరిమధ్యలో నిలబెట్టేసిన ఆమెను, రాళ్లతో కొట్టి చంపాల్సిందిగా మరణశిక్షను విధించారు. అలా అత్యంత దారుణంగా సదరు మహిళను అందరూ రాళ్లతోకొట్టి చంపేశారు. ఈ వీడియోను ఆన్ లైన్ లో కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. సదరు మహిళ తనను క్షమించాల్సిందిగా తన తండ్రితో ఎన్నిసార్లు వేడుకుంటున్నా, నిరాకరించినట్లు వెల్లడైంది.

వీడియోలో భాగంగా మొదటి ఐదు నిమిషాల వరకు సదరు మహిత తండ్రితో కలిసి కనిపిస్తుంది. వారి పక్కనే ఓ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ కూడా కనిపిస్తాడు. తనను క్షమించాల్సిందిగా ఆమె తన తండ్రితో ఎన్నిసార్లు వేడుకున్నా, అతడు నిరాకరించినట్లు వెల్లడైంది. అంతేకాకుండా ఆ కిరాతక తండ్రే రాళ్లను పోగుచేసి అక్కడున్న వారందరికీ ఇచ్చాడు. సెంట్రల్ సిరియా ప్రావిన్స్ లో వివాహేతర సంబంధం కారణంగా తొలిసారి ఓ మహిళకు మరణశిక్ష విధిస్తున్నట్టు ఐఎస్ ఉగ్రవాద నాయకుడు ప్రకటించాడు. ఆమె చనిపోయేంతవరకు రాళ్లతో కొట్టాల్సిందిగా ఆదేశించాడు. దీంతో అక్కడ గుమికూడిన జనం అందరూ చూస్తుండగానే ఆమెను రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయాలు మాత్రం తెలియరాలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles