Pm modi congratulates isro scientist for their hard work

Mars orbiter mission, Mom, mangalyaan, ISRO, Mars, India, First asian country, launch, stable, trajectory, PM, Narendra Modi

PM Modi congratulates ISRO scientist on successful launch of mangalyan

మంగళ్ యాన్ ప్రయోగం ఒక చారిత్రాత్మక ఘట్టం

Posted: 09/24/2014 08:32 AM IST
Pm modi congratulates isro scientist for their hard work

మామ్ అంటే అమ్మ.. మనల్ని అమ్మ ఎప్పుడూ నిరాశపరచదు... అమ్మలాగే మామ్ విజయతీరాలకు చేర్చిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతమైన సందర్భంగా ఇస్రో కంట్రోల్ రూమ్‌లో శాస్త్రవేత్తల నుద్దేశించి మోడీ ప్రసంగించారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆసియాలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అరుణగ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇవాళ చరిత్ర లిఖించామని అభివర్ణించారు. అసాధ్యమనుకున్న ప్రయోగాన్ని భారతీయ శాస్త్రవేత్తలు సుసాధ్యం చేసి చూపించారని ఇస్రో శాస్త్రజ్క్షులపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ సాంకేతిక రంగంలో భారత్ చరిత్ర సృష్టించిందని మోడీ అన్నారు. ఇతరులు అసాధ్యమని, ఊహించడానికి కూడా ధైర్యం చేయలేకపోయిన కార్యాన్ని మనం సుసాధ్యం చేసి చూపించామని మోడీ అన్నారు.
 
ఇస్రోను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారని ప్రధాని అన్నారు. మొదటి ప్రయత్నంలోనే విజయం భారత శాస్త్రవేత్తలకే దక్కడం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రయోగం ఒక చారిత్రత్మక ఘటం అని ఉద్వేగంతో ప్రసంగించారు. తొలి ప్రయత్నంలోనే మనం విజయం సాధించామని శాస్త్రవేత్తలను ప్రశంసించారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్‌ కన్నా మామ్ ప్రయోగం బడ్జెట్ తక్కువని మోడీ వ్యాఖ్యానించారు. అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ నిలిచిందన్నారు. మన శాస్త్రవేత్తల కోఠర శ్రమతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. మన శాస్త్రవేత్తల విజయాలు రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

అంతకుముందు మంగళ్ యాన్ విజయాన్ని వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేంద్రమంత్రి సదానందగౌడ తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు ఇస్రోకు చెందిన టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్(ఇస్టాక్)కు చేరుకున్నారు. భూమిపై సూర్యోదమయ్యే వేళకు ... దాదాపు ఏడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ గ్రహానికి మామ్ శుభోదయం పలుకుతుంది. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రధాని వీక్షించారు. ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి మామ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను పరిశీలించారు. ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి ప్రధాని మోడీ 'మామ్'ను అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను పరిశీలించారు.

 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mars orbiter mission  Mom  mangalyaan  ISRO  Mars  India  First asian country  launch  PM  Narendra Modi  

Other Articles