Unknown person enters into girls hostel at midnight

girls hostel, ladies hostel, social welfare hostels, social welfare schools, gurukula school, gurukula colleges, andhrapradesh, vijayanagaram, latest news, principal, husband, abuse, harassement, girls hot, sexually harassed, abvp, aidwa, protest

unknown person enters into girls hostel in vijayanagaram district : principal's husband suspected to be entered into girls hostel and creates nuisence in girls rooms

అర్ధరాత్రి హాస్టల్ కు వచ్చింది ప్రిన్సిపల్ భర్తేనా?

Posted: 09/09/2014 03:25 PM IST
Unknown person enters into girls hostel at midnight

కంచే చేను మేసినట్లు.., అమ్మాయిలను కాపాడాల్సిన కాలేజి ప్రిన్సిపలే.. తన భర్త అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్ కు వెళ్తే సమర్ధించుకుంది. విజయనగరం జిల్లాలో ఈనెల 4వ తేదిన జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసి ఆమె భర్తపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వివరాలు చూస్తే., నెల్లిమర్లలో సాంఘీక సంక్షేమ పాఠశాల, జూనియర్ కాలేజిలతో పాటు వాటి హాస్టళ్లు కూడా ఒకే కంపౌండ్ లో ఉన్నాయి. ఈ ప్రాంగణంలో విద్యార్థుల కోసం కొత్తగా డార్మిటరీలు కడుతున్నారు.

ఈనెల 4వ తేది అర్ధరాత్రి ఓ ఆగంతకుడు బాలికల హాస్టల్ లోకి ప్రవేశించాడు. పూర్తిగా బట్టలు లేకుండా ఉండటమే కాకుండా.., గదిలో పడుకున్న అమ్మాయిల బట్టలను బ్లేడుతో తొలగించాడు. అయితే ఉపాధ్యాయ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమాల కోసం బాగా ప్రాక్టిస్ చేసిన విద్యార్థినులు అలిసిపోయి పడుకోవటంతో కామాంధుడి చేష్టలు తెలుసుకోలేకపోయారు. ఇదే సమయంలో కొంతమంది విద్యార్థులకు మెలుకువ రావటంతో రూంలో ఎవరో ఉన్నారంటూ కేకలు పెట్టారు. అరగంట పాటు అరుపులు విన్పించినా వార్డెన్ అటువైపు కూడా రాలేదు. విద్యార్థినులంతా నిద్రలేవటంతో దొరకిపోతానని భయపడి దుప్పటి కప్పుకుని అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే ఈ విషయాన్ని వెంటనే స్కూల్ లో చెప్పటానికి విద్యార్థినులు సాహసించలేదు. రెండ్రోజుల తర్వాత తమను కలిసేందుకు వచ్చిన తల్లితండ్రులకు చెప్పటంతో ఉదంతం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కాలేజి ఎదుట ధర్నాకు దిగాయి. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. అయితే అర్ధరాత్రి హాస్టల్ కు వచ్చింది.., తన భర్తేనని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ప్రిన్సిపల్ అన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని జెడ్పీ చైర్మన్ సహా పలువురు రాజకీయ నేతలు పరిశీలించారు. విషయం తెలుసుకున్న సోషల్ వెల్ఫేర్ జోనల్ ఆఫీసర్ కాలేజికి వచ్చి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వివాదం బయటకు పొక్కటంతో స్పందించిన పోలిసులు కేసు నమోదు చేసుకున్నారు. హాస్టల్ కు వచ్చిన వ్యక్తి ముఖ పోలికలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే పనిచేస్తున్న కూలిలను విచారించి ఆధారాలు సేకరించారు. అయితే అర్ధరాత్రి హాస్టల్ కు తన భర్తే వచ్చినట్లు ప్రిన్సిపల్ చెప్తున్నా ఈ దిశగా పోలిసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సింది పోయి.., భర్త హాస్టల్ కు వచ్చి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తే బాధపడకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఓ మహిళా ప్రిన్సిపల్ చెప్పటం సిగ్గుచేటు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girls hostel  latest news  social welfare college  vijayanagaram  

Other Articles