Telangana cm kcr fires on telugu tv news channels once again which members protesting for the past days

telangana cm kcr, kcr latest news, kcr fires news channels, kcr news, kcr press meet, kcr kaloji jayanthi, tv9 abn andhrajyothy news channels

telangana cm kcr fires on telugu tv news channels once again which members protesting for the past days

న్యూస్ ఛానెళ్లను 10కి.మీ.లోతున పాతర వేస్తాం : కేసీఆర్

Posted: 09/09/2014 03:11 PM IST
Telangana cm kcr fires on telugu tv news channels once again which members protesting for the past days

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి న్యూస్ ఛానెళ్ల మీద విజృంభించారు. ఇటీవలే న్యూస్ ఛానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఆయా ఛానెళ్ల జర్నలిస్టులు, యాంకర్లు, ఇతర సభ్యులు నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఆగ్రహానికి గురయిన కేసీఆర్... కాళోజీ శతయ జయంతి ఉత్సవాల్లో వారిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉనికిని అగౌరవపరిస్తే పాతరేస్తామని ఆయన మీడియా ఆందోళనపై ఘాటుగా స్పందించారు. మంగళవారం కాళోజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేసీఆర్.. ‘‘మా గడ్డ మీద వుండాలంటే మా ప్రాంతానికి సలాం కొట్టాలి. అంతేకానీ.. తెలంగాణ ప్రాంతాన్ని కించపరిచే ఆ ఛానెల్స్ మాకు అక్కరలేదు’’ అని ఆయన అన్నారు. అలాగే.. ‘‘పాచికల్లు తాగే మొఖాలంటే క్షమించాలా.. పాతర.. పాతర వేస్తాం.. పదికిలోమీటర్ల లోతున’’ అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మాట్లాడుతూ.. తనను తిడితే బాధలేదని, తెలంగాణ శాసనసభ్యుల్ని ఇంత ఘోరంగా తిట్టడం చాలా అవమానకరమని అన్నారు. తెలంగాణ సభ్యులంతా ఆ ఛానెల్స్ పై సమిష్టిగా తీర్మానం చేశాయని.. ఆ వ్యవహారం ప్రస్తుతం స్పీకర్ పరిధిలో వుందని అన్నారు. అయితే ఈ వ్యవహారానికి వెంటనే స్పందించిన ఎంఎస్ఓ ఆ ప్రసారాలను నిలిపివేశారని అన్నారు. సదరు ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేసిన తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ సంఘానికి తాను సెల్యూట్ చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.

అయితే ఈ ఛానెళ్ల ప్రసార వ్యవహారాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోయి అనవరంగా రాద్ధాంతం చేశారని విమర్శించిన ఆయన.. సంబంధిత ఛానెళ్లలో పనిచేస్తున్న స్థానిక ఉద్యోగులు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇక్కడ కేసీఆర్ చెబుతున్న మాటలప్రకారం.. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ రెండు న్యూస్ ఛానెళ్ల (టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి) ప్రసారాలను తెలంగాణలో తిరిగి పునరుద్ధిరించే అవకాశాలు పూర్తిగా లేనట్టుగానే కనిపిస్తున్నాయి. మరి ఇందుకు ఆ న్యూస్ ఛానెళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో..? దీనిమీద ఇతర నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  kaloji shatha jayanthi  tv9 news channel  abn andhrajyothy news channel  

Other Articles