Reddy and revanth reddy comments on kcr

jagga reddy, revanth reddy, kcr, ktr, medak by poll, slap, slipper slap, criticise, politics, bjp, trs, tdp, congress, latest news, politics

jagga reddy and revanth reddy fires on kcr and trs leaders : will slap if criticise not stopped says jagga reddy and revanth reddy

చెప్పుతో కొడతామని కేసీఆర్ కు వార్నింగ్

Posted: 09/02/2014 04:40 PM IST
Reddy and revanth reddy comments on kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ, బీజేపీ విరుచుకుపడ్డాయి. తమపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్, ఆయన వర్గంపై రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తరుచుగా తమను సమైక్యవాదులు అని విమర్శించటాన్ని తట్టుకోలేకపోయారు. మరొకసారి తమను సమైక్యవాదులంటే చెప్పుతో కొడతామని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెలిస్తే ఫాం హౌజ్ లో కేసీఆర్ కు మందు పోయటానికి.., కవిత బ్యాగులు మోయటానికి మాత్రమే పనికొస్తాడు తప్ప పార్లమెంటులో మాట్లాడేందుకు కాదన్నారు.

మెదక్ జిల్లా గజ్వేల్ లో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ భేటిలో నేతలిద్దరూ పాల్గొన్నారు. తమను ఎవరైనా విమర్శిస్తే వారితో బంతాట ఆడుకుంటామన్నారు. సమైక్యవాదానికి కొమ్ముకాసి.., పార్టీలు మారేవారిని పక్కన బెట్టుకున్న టీఆర్ఎస్ తమపై విమర్శలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

జగ్గుకు డిపాజిట్టే రాదు - కేటీఆర్

కాగా జగ్గారెడ్డికి మెదక్ ఉపఎన్నికలో డిపాజిట్ కూడా రాదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ విధానాలు కొని తెచ్చుకుంటున్న టీడీపీ మెదక్ అభ్యర్ధి విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించిందన్నారు. బీజేపి అంటే ఇప్పుడు బాబుగారి జగ్గారెడ్డి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. లక్ష మెజార్టి రాకుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని గతంలో చెప్పుకున్న జగ్గారెడ్డి మళ్ళీ ఎన్నికల్లో పోటి చేస్తే ప్రజలు తెలివిగా వ్యవహరించి ఓడించటం ఖాయమన్నారు. ఈ సారి జగ్గుకు గుండుకొట్టించి మరి చావగొడతారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagga reddy  revanth reddy  ktr  medak by poll  

Other Articles