Medak bypoll war

medak bypoll, elections, election results, latest news, medak, kcr, trs, ktr, kishan reddy, jagga reddy, prabakar reddy, revanth reddy, harish rao, sunitha laxmareddy, politics, slap, slipper slap

meak by poll heat raised leaders accusing each other with hard words : tdp, bjp counters on trs also car party accuses bjp and tdp in election war campaign

మెదక్ కోసం చెప్పుదెబ్బలకు సిద్ధం. కోటలు దాటుతున్న మాటల యుద్ధం

Posted: 09/02/2014 07:04 PM IST
Medak bypoll war

మెదక్ ఉప ఎన్నిక రాజకీయ వేడిని పుట్టిస్తోంది. పార్టీలు.., నేతల మద్య నిత్యం మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరు నీతి అంటే మరొకరు అవినీతి అని.., ఒక పార్టీ పవిత్రం అంటే మరొక పార్టీ అపవిత్రం అని కౌంటర్ - ఎన్ కౌంటర్ విధంగా జరుగతోంది. చివరకు చెప్పుదెబ్బల వరకు వచ్చింది. పార్టీలు ప్రజా సమస్యలు, ఎన్నికల మ్యానిఫెస్టో హామీల కంటే విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. నేతల తిట్లను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేమి వైపరిత్యమంటూ మారుతున్న రాజకీయాలపై చర్చించుకుంటున్నారు.

జగ్గారెడ్డికి డిపాజిట్ కూడా రాదు - కేటీఆర్

జగ్గారెడ్డికి మెదక్ ఉపఎన్నికలో డిపాజిట్ కూడా రాదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. లక్ష మెజార్టి రాకుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని గతంలో చెప్పుకున్న జగ్గారెడ్డి మళ్ళీ ఎన్నికల్లో పోటి చేస్తే ప్రజలు తెలివిగా వ్యవహరించి ఓడించటం ఖాయమన్నారు. ఈ సారి జగ్గుకు గుండుకొట్టించి మరి చావగొడతారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ విధానాలు కొని తెచ్చుకుంటున్న టీడీపీ మెదక్ అభ్యర్ధి విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించిందన్నారు. బీజేపి అంటే ఇప్పుడు బాబుగారి జగ్గారెడ్డి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు.

దీనికి జగ్గారెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. అటు రేవంత్ రెడ్డి కూడా గళం కలిపారు. ఇద్దరూ కలిసి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర పదజాలంలో విమర్శలు చేశారు. మరోవైపు తెలంగాణ బీజేపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా జగ్గారెడ్డిని వెనకేసుకొచ్చారు. టీఆర్ఎస్ విధానాలను గట్టిగా ఎండగట్టారు.

‘‘సమైక్యవాది అంటే చెప్పుతో కొడతాం’’

కేసీఆర్, ఆయన వర్గంపై రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తరుచుగా తమను సమైక్యవాదులు అని విమర్శించటాన్ని తట్టుకోలేకపోయారు. మరొకసారి తమను సమైక్యవాదులంటే చెప్పుతో కొడతామని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెలిస్తే ఫాం హౌజ్ లో కేసీఆర్ కు మందు పోయటానికి.., కవిత బ్యాగులు మోయటానికి మాత్రమే పనికొస్తాడు తప్ప పార్లమెంటులో మాట్లాడేందుకు కాదన్నారు.

ఉద్యమం సమయంలో వైసీపీలో ఉండి తెలంగాణవాదులపై మానుకోటలో రాళ్ళ వర్షం కురిపించిన కొండా సురేఖను కారు ఎక్కించుకున్నపుడు టీఆర్ఎస్ నీతి ఏమయిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు ఒక నీతి.., ఇతర పార్టీలకు మరో నీతి సరైన విధానమా కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ కు ఒక నీతి.., ఇతర పార్టీలకు మరో నీతి సరైన విధానమా కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రాయలసీమ కోసం పట్టుబట్టిన మజ్లిస్ నేతలతో కలిసి తిరుగటాన్ని ఏమనాలని ప్రశ్నించారు. జగ్గారెడ్డికి టికెట్ ఇస్తే భూమి బద్దలయినట్లు టీఆర్ ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ఇలా నేతలంతా విమర్శలు, ప్రతి విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ మాత్రం పావుగా మారలేదు. ఆ పార్టీని ఎందుకో ముగ్గురూ వదిలి పెట్టి తమలో తాము తిట్టేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభావం చూపలేదనా.., లేక వీరిని తిట్టేసుకోవటానికే సమయం లేదనా? నేతలకు నిజంగా చిత్తశుద్ది ఉంటే రాజకీయ విమర్శలు మాని పదకొండు రోజుల్లో ఉన్న ఉప ఎన్నికపై దృష్టి పెట్టేవారు. ఇలా ప్రజల కంటే పార్టీ పర విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారు గెలిచాక అయినా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పట్టించుకుంటారని గ్యారంటి ఏంటి. అయినా ఓటరు తెలివైన వారు నేతలెంత తిట్టి పోసుకున్నా.. ఎవరేమిటో వారికి తెలుసు. ఎవరికి ఓటేయాలో డిసైడయ్యే పోలింగ్ కేంద్రానికి వెళ్తారు. కాబట్టి విమర్శలు మాని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే మంచింది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kishan reddy  kcr  jagga reddy  medak bypoll  

Other Articles