Central home minister rajnath singh denies the rumours on his son and family

central home minister rajnath singh, central home minister, bjp central home minister, rajnath singh latest news, rajnath singh news, rajnath singh press meet, rajnath singh comments, rajnath singh narendra modi, narendra modi press meet

central home minister rajnath singh denies the rumours on his son and family

ఆరోపణలు నిజమైతే తప్పుకుంటా! :రాజ్ నాథ్ సింగ్

Posted: 08/27/2014 06:20 PM IST
Central home minister rajnath singh denies the rumours on his son and family

భారత ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ కు ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో లోక్ సభ టికెట్ ఇవ్వడానికి మోడీ నిరాకరించారనే వార్తలు గతంలో వెలువడిన సంగతి తెలిసిందే! అయితే ప్రస్తుతం ఇది పెద్ద దుమారంగా మారిపోయింది. అవినీతి, చెడు ప్రవర్తనలు అలవాటు కావడం వల్ల మోడీ, పంకజ్ కు టికెట్ ఇవ్వలేదని రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అలాగే రాజ్ నాథ్ సింగ్ కుటుంబం అవినీతితో కూరుకుపోయిందని... అందువల్లే మోడీ కూడా సీటు ఇవ్వడానికి విముఖత చూపారని ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో ఇది దేశరాజకీయాల్లో పెద్ద అంశంగా మారిపోయింది. పార్టీ అధ్యక్షుడిపైనే ఇటువంటి ఆరోపణలు రావడం అందరికీ ఆశ్చర్యాన్నే గురించేసింది!

అయితే తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలను రాజ్ నాథ్ సింగ్ ఖండిస్తున్నారు. తన కొడుకుపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం వుంటే తాను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయం మీద తాను ప్రధాని మోడీతో, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి చర్చించానని ఆయన తెలిపారు. తనపై రాజకీయ మచ్చ వేయడానికే ఇలా అనవసరంగా దుష్ర్పచారం చేస్తున్నారని.. ఇటువంటి వదంతులను నమ్మకండని ఆయన అన్నారు. అవసరమైతే తన కొడుకు, కుటుంబం మీద వచ్చిన ఆరోపణల నిమిత్తం దర్యాప్తు చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

ఇదిలావుండగా.. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్ నాథ్ పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని, అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇటువంటి వార్తలను సృష్టిస్తున్నారని.. ఇటువంటి వార్తలను అందరూ ఖండించాలంటూ పీఎంవో కార్యాలయం పేర్కొంది. మోడీ కూడా ఈయనకు మద్దతు పలికారు. ఎవరో కావాలనే ఇటువంటి వదంతులను సృష్టిస్తున్నారని.. మంత్రులపై బురదజల్లడం ద్వారా కేంద్రం ప్రతిష్టను దిగజార్చాలని కొన్ని వర్గాలు భావిస్తున్నాయని ఆయన అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp central home minister  rajnath singh  narendra modi  amit shah  bjp party  

Other Articles