Balakrishna escaped from telangana survey with family memers

balakrishna, balakrishna latest news, balakrishna family members, balakrishna wife, balakrishna telangana survey, balakrishna survey

balakrishna escaped from telangana survey with family memers : tollywood actor - tdp mla nandamuri balakrishna escaped from telangana samagra kutumba survey with his family members

తెలంగాణ సర్వేలో గర్జించని బాలకృష్ణ!

Posted: 08/20/2014 04:17 PM IST
Balakrishna escaped from telangana survey with family memers

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబసర్వేకు సంబంధించి రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సర్వే లెక్కలప్రకారం చూస్తుంటే... సామాన్య ప్రజలకంటే ప్రముఖులే ఎక్కువగా డుమ్మా కొట్టినట్టు కనిపిస్తుంది. సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె - ఎంపీ కవిత ఈ సర్వేలో పాల్గొనలేదు. అలాగే పవర్ స్టార్ - జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, విజయ్ శాంతిలు ఈ సర్వేలో పాల్గొనలేదు. ఇప్పుడు వీరి లిస్ట్ లో ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా చేరిపోయారని సమాచారం!

ఒకవైపు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ కేంద్రమంత్రి - కాంగ్రెస్ నేత చిరంజీవి తన వివరాలను నమోదు చేసుకోగా.. బాలకృష్ణ మాత్రం ఇందుకు గైర్హాజరు అయ్యారు. బాలకృష్ణ కుటుంబ వివరాలతోసహా ఆయన ఆస్తుల వివరాలను సర్వేలో భాగంగా నమోదు చేసుకోవడానికి అధికారులు ఆయన ఇంటికి చేరుకోగా వారికి నిరాశే మిగిలింది. ఎందుకంటే.. ఆయన నివాసంలో ఎవరూ లేకపోవడమే కారణం. సర్వే జరుగుతున్నరోజు అందరూ ఇంటిదగ్గరే వుండి తన వివరాలను అధికారులకు తెలిపి సహకరించాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. బాలకృష్న కుటుంబ సమేతంగా సర్వే నుంచి తప్పుకున్నారు. వివరాలను సేకరించడానికి వెళ్లిన నోడల్ అధికారి సదానందన్, ఎన్యూమరేషన్ అధికారి రమేష్ లు ఆయన నివాసానికి రెండుసార్లు వెళ్లామని తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  telangana samagra kutumba survey  chandrababu naidu  kcr  

Other Articles