Hyderabad mero rail alignment is not changing

telangana cm kcr about metro rail alignment in hyderabad, kcr and metro rail md vivek b gadgil clarifies that hyderabad mero alignment is not changing, hyderabad metro rail project, telangana cm kcr, telangana cm kcr latest news, hyderabad metro rail project latest news, hyderabad metro rail md vivek b gadgil, metro alignment in hyderabad

telangana cm kcr and metro rail md vivek b gadgil clarifies that hyderabad mero alignment is not changing

‘‘మాట మార్చను.. మడం తిప్పను!’’ కేసీఆర్

Posted: 08/01/2014 11:54 AM IST
Hyderabad mero rail alignment is not changing

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కొత్త ట్విస్ట్ లు చేస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. నిన్నమొన్నటివరకు ఆయన ముక్త కంఠంతో బహిరంగంగా వ్యాఖ్యానించిన కొన్ని మాటలను.. తానే స్వయంగా కొట్టిపారేస్తున్నారు. ‘‘అబ్బే... గతంలో అలా అని వుంటాను కానీ ఇప్పుడు మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నాను’’ అంటూ స్వయంగా ఆయనే పేర్కొనడంతో అందరూ ఖంగుతింటున్నారు. ‘‘అదేంటి..? మొన్నటివరకు ఒకే మాట మీద వుంటూ పక్కాపంథాతో ముందడుగు వేసిన కేసీఆర్.. ఇలా వెనక్కు తగ్గిపోయారేంటి..?’’ అంటూ ప్రతిఒక్కరు సందేహాల్లో మునిగిపోయారు.

అసలు జరిగిందేమిటంటే... గతంలో మెట్రో రైలు రూట్ మార్పుపై సీఎం కేసీఆర్ వివిధ సందర్భాల్లో ఎన్నోరకాల వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రో రైలు రూటును మార్చాల్సిందే’’ అని ఆయన సీరియస్ గా ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన అప్పట్లో మాట్లాడుతూ.. ‘‘మెట్రో రైలుతో చారిత్రాత్మక కట్టడాలకు ముప్పు వాటిల్లుతుంది. అలా జరగడానికి వీల్లేదు. అసెంబ్లీ ముందు నుంచి మెట్రో కారిడార్ రూట్ ను ఖచ్చితంగా మార్చాల్సిందే! భూగర్భం లేదా ఇతర మార్గాల ద్వారా మెట్రోరైలు కారిడార్ ను నిర్మించి... హైదరాబాద్ లో వున్న చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించాల్సిందే! ఈ విషయం మీద మెట్రో రైల్ అలైన్ మెంట్ ను మార్చాల్సిందేనని ఎల్ అండ్ టీ సంస్థకు కూడా స్పష్టం చేశాను!’’ అని మీడియా సమావేశంలో బహిర్గతంగా చాలా సందర్భాల్లో సీరియస్ గా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇక మెట్రో అలైన్ మెంట్ ఖచ్చితంగా మారిపోతుందని అని అందరూ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు కూడా!

కానీ తాజాగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ ‘‘మెట్రో రైల్ స్టోరీ’’లో కొన్ని మార్పులు చేర్పులు చేసి, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ వివేక్ బి.గాడ్గిల్ కు సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. గతంలో ఆయన మెట్రో రైల్ అలైన్ మెంట్ మీద ఇచ్చిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ... ‘‘ప్రస్తుతానికి హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణంలో ఎటువంటి మార్పులు చేయడం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఇంతేకాదు.. ఇప్పటివరకు మెట్రో రైల్ అలైన్ మెంట్ మార్పుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచిగానీ, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నుంచిగానీ తమకు ఎలాంటి ప్రతిపాదనలు, సమాచారాలు రాలేదని ఆయన అందరికీ మతిభ్రమించేలా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ మెట్రో రైల్ ఎండీ చెప్పడంతో.. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ఇంకా కోలుకోలేని అయోమయంలో పడిపోయాయి.

‘‘ఇదేంటి..? కేసీఆర్ గతంలో తన ముక్త కంఠంతో మెట్రో రైల్ అలైన్ మెంట్ మార్చాల్సిందేనని పదే పదే మీడియా సమావేశాల్లో పేర్కొంటే... ఈ ఎండీ ఏంటి అందరికీ ఇలా షాకిచ్చాడు..?’’ అని అందరూ ఆందోళనల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ మేటర్ హైదరాబాద్ నగరంలో, మెట్రో రైల్ సంస్థలో పెద్ద దుమారంగా మారిపోయింది. ఒకవైపు మెట్రో రైల్ ఎండీ దీని అలైన్ మెంట్ మీద కేసీఆర్ మార్చొద్దని సందేశం ఇచ్చినట్లు పేర్కొంటే.. మరోవైపు ఈ విషయం మీద సీఎం కేసీఆర్ ఇంకా పెదవి విప్పలేదు. రానురాను ఈ మేటర్ ఇంకా ఎక్కడికి వెళ్లనుందో!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles