Videos of children rapes in the laptop of rapist

Videos of children rapes in the laptop of rapist, 6 year old raped in Bangalore school, Police apprehended rapist in Bangalore school

Videos of children rapes in the laptop of rapist of 6 year old in Bangalore school

రేపిస్ట్ ల్యాప్ టాప్ లో రేప్ వీడియాలు!

Posted: 07/21/2014 09:15 AM IST
Videos of children rapes in the laptop of rapist

బెంగళూరులో 6 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేసిన స్కేటింగ్ ఇన్స్ స్ట్రక్టర్ ముస్తాఫా అలయాస్ మున్నా ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని ల్యాప్ టాప్ లోను, సెల్ ఫోన్ లో ఉన్న వీడియోలను చూసి అవాక్కయ్యారు.  ల్యాప్ టాప్ లో చిన్నపిల్లలను రేప్ చేసిన వీడియోలు, సెల్ ఫోన్ లో పోర్నో వీడియాలు ఉండటం చూసి అతని ఆలోచనా సరళి ఎలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చంటున్నారు పోలీసులు.  

జూలై 2 న బెంగళూరులోని విబ్గ్యోర్ హైస్కూల్ వ్యాయామశాలలోని ఇన్స్ స్ట్రక్టర్లు ఆరు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చెయ్యటం నగరంలో సంచలనం రేపింది.  ఐటి ప్రొఫెషన్ లో ఉన్న ఆ అమ్మాయి తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా రోడ్ల మీద ఆందోళనలను ప్రదర్శించటం ద్వారా పోలీసుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చారు.  నిందితులనే కాకుండా స్కూల్ మీద కూడా చర్య తీసుకోవలని వాళ్ళు డిమాండ్ చేసారు.  ఎందుకంటే ఇదంతా జరిగింది ఆ అమ్మాయికి పనిష్మెంట్ గా జిమ్ వస్తువులను భద్రపరచే చోట గదిలో కూర్చోమని అన్నారు.  అక్కడే ఈ అత్యాచారం జరిగింది.  అందుకే, చిన్న పిల్లల భద్రత గురించి పట్టించుకోని ఆ స్కూల్ యాజమాన్యం మీద కూడా చర్య తీసుకోవాలని  డిమాండ్ చెయ్యటం జరిగింది.

bangalore-protests-rape-cas

ఈ ఘటన మీద ప్రతిపక్ష పార్టీలు హోంమంత్రి కెజే జార్జ్ రాజీనామా కోరటం కూడా జరిగింది.  దానితో పోలీసులు ఒక మనిషిని పట్టుకున్నారు.  నేరంలో భాగస్తులని పోలీసులు భావిస్తున్న మరో ఇద్దరి కోసం గాలింపు జరుగుతోంది.  ఈలోపులో జరిగిన దర్యాప్తు ఫలితాలను వెల్లడి చెయ్యటం కోసం మీడియా సమావేశాన్ని నిర్వహించిన బెంగళూరు పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ నిందితుడు ముస్తాఫాను సోమవారం కోర్టులో హాజరుపరచి జుడిషియల్ కస్టడీని కోరుతామని తెలియజేసారు.  

32 సంవత్సారాల ముస్తాఫా బీహార్ కి చెందినవాడు.  20 సంవత్సరాలుగా బెంగళూరులో నివసిస్తున్నాడు.  బాధితురాలైన బాలిక షాక్ లో ఉండటం వలన దర్యాప్తు ముందుకు సాగటంలో జాప్యమైందంటున్నారు పోలీసులు.   కానీ ఇంత ఆందోళన చెయ్యకపోతే పోలీసులు చర్యే తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు ఆందోళనకారులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles