Ycrp mla peddireddy ramachandra reddy comment on sakshi media

ys jagan cm post, ys jagan, peddireddy ramachandra reddy ycp mla, peddireddy ramachandra reddy setire on sakshi media, ycp leaders shock

Ycrp MLA Peddireddy ramachandra reddy comment on sakshi media, peddireddy ramachandra reddy ycp mla, peddireddy ramachandra reddy setire on sakshi media, ycp leaders shock

జగన్ ను మోసం చేసిన సాక్షి?

Posted: 07/21/2014 08:34 AM IST
Ycrp mla peddireddy ramachandra reddy comment on sakshi media

ఐదు సంవత్సరాల ఆశ, జీవిత కల, తప్పకుండా తీర్చుతుందని .. కోటీ ఆశలతో.. వైఎస్ జగన్ ప్రజలపై నమ్మకం పెట్టుకొని.. ఓదార్పు యాత్రలు, చెల్లెమ్మ పాదయాత్ర, తల్లీ దీక్షలతో ముఖ్యమంత్రి పదవి సొంతం అవుతుందని సాక్షి పేపర్ , సాక్షి టీవీ చానల్, పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయించుకున్నారు జగన్. కానీ విది జగన్ తో విచిత్రంగా ఆడుకుంది. అనుకున్నది ..ఒక్కటి జరిగింది మర్కొటి. చేతిదాకా వచ్చిన సీఎం పదవి.. నోటి దగ్గరకు రాకుండానే జారీ పోయి ..చంద్రబాబు కు దక్కింది.

అయితే జగన్, తన ఓటమి పై ఎన్నో సర్వేలు చేయించాడు, తన పార్టీ నేతలతో చర్చలు జరిపాడు..కానీ ఆయనకు తన ఓటమి గురించి అసలు విషయం తెలియలేదు. దీంతో ఆయనలో ఆవేశంలో ఎలా ఉంటుందో.. సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు పై అసెంబ్లీలో చూపించటం జరిగింది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది.. అసలు నిజాలు బయటపడుతున్నాయి. జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , జగన్ కు సీఎం పదవి దక్కకపోవటానికి గల కారణం ఏమిటో మీడియా ముందు చెప్పటం జరిగింది.

అసలు జగన్ సీఎం కాకపోవటానికి .. కారణం సాక్షి దినపత్రిక, టీవీ ఛానల్, అని పెద్దిరెడ్డి చెప్పటం జరిగింది. సొంత మీడియాలో ప్రదర్శించిన అతి విశ్వాసం కారణంగానే అధికారంలోకి రాలేకపోయారన్నారు. సదుం గార్గేయ నదిపై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య సస్వామి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు మొదలయ్యాయి. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డికి ఆలయ కమిటీ వారు స్వామివారి శేషవస్ర్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక విలేకరులు ఫొటోలు తీస్తుండగా, సాక్షి విలేకరి కనిపించలేదు. దీనిపై ఆయన ఆరాతీస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. సాక్షి మీడియా వైసీపీ కరపత్రిక అన్న ముద్ర ప్రజల్లో బలంగా పడిందన్నారు. దానికి తోడు ఎన్నికల సమయంలో సాక్షి పత్రిక ప్రచురణలు, చానల్‌ ప్రసారాలు జగన్‌తో పాటు తమ పార్టీలో అతి విశ్వాసాన్ని కల్పించాయని ఆయన తెలిపారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles