Evil spirit fear in chitoor district

evil spirit fear in Chitoor district, Chitoor district Peddapalli village, Peddapalli village fear gripped, Youth dying in Chitoor district fear

evil spirit fear in Chitoor district

చిత్తూరు జిల్లాలో చెలరేగుతున్న ప్రేతాత్మ భయం

Posted: 02/26/2014 12:28 PM IST
Evil spirit fear in chitoor district

అది చిత్తూరు జిల్లా మదనపల్లి డివిజన్ లో కొత్తకోట మండలంలోని ప్రశాంతమైన పెద్దపల్లి గ్రామం.  కానీ గత సంవత్సర కాలంలో చిత్రమైన రీతిలో చనిపోతున్న అవివాహిత యువకుల వలన గ్రామంలో భయం చోటుచేసుకుంది. 

గ్రామంలోంచి కొందరు యువకులు పై చదువులు, పెద్ద ఉద్యోగాలకు మదనపల్లి, బెంగళూరు పోగా కొందరు యువకుల అక్కడే కుటుంబసభ్యులకు ఆసరాగా ఉంటూ డ్రైవర్లగా పనిచేస్తున్నారు.  22, 25 మధ్య వయసుగల యువకులు గత సంవత్సరకాలంలో 5 గురు చనిపోయారు.  ఈ మధ్యనే నాలుగు రోజుల క్రితం 22 సంవత్సరాల వయసులో ఉన్న గోవర్ధనరెడ్డి అనే ఇంజినీరింగ్ విద్యార్ధి తన సెల్ ఫోన్ ని ఛార్జ్ చేస్తూ విద్యుదాఘాతంతో మరణించాడు.  దీనితో గ్రామానికి ఏదో మానవాతీతమైన శక్తి కీడు తలపెడుతోందని గ్రామవాసులంతా గట్టిగా నమ్మటం మొదలుపెట్టారు.  కొందరు రైతులు తమకు అపారమైన పంటనష్టం వచ్చి అప్పుల పాలయ్యామని వేదన పడుతున్నారు. 

సాయంత్రం కాగానే గ్రామమంతా నిశ్శబ్ద వాతావరణం ఆవరిస్తోంది.  వెలుగుండగానే పొలం పనులు ముగించుకుని ఇంటికొచ్చేస్తున్నారు.  మిట్ట మధ్యాహ్నం కానీ రాత్రి పూట కానీ యువకులను గ్రామవాసులు బయటకు రానివ్వటం లేదు. ఏమాత్రం ఎవరికైనా అస్వస్థత ఉన్నా గ్రామంలో ఆ వార్త వణుకు పుట్టిస్తోంది. 

వీటన్నిటికీ తోడు గ్రామంలోని యువకుల పెళ్ళి సంబంధాలు కూడా చెడిపోతున్నాయి.  ఇవన్నీ చూసి గ్రామవాసులంతా తమ ప్రాంతం మీద ఏదో దుష్టశక్తి ప్రభావం పడిందని గాఢంగా నమ్ముతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles