Ys vijayamma arrested in nallagonda district

ys vijayamma arrested in nallagonda district, Vijayamma Faces Hurdles in Her Tour YS Vijayamma tour in Khammam, YS Vijayamma, YSRCP Honorary President YS Vijayamma, Vijayamma Faces Hurdles in Her Tour, Vijayamma tour in Khammam and Nalgonda districts, YSR Congress party leaders, Vijayamma is arrested by Kodada police at Painampalli, Vijayamma is arrested by Kodada police, YSRCP

ys vijayamma arrested in nallagonda district, ys vijayamma arrested and prevented from visiting telangana

టీ-సెగతో.. వైఎస్ విజయమ్మ అరెస్ట్

Posted: 10/31/2013 05:42 PM IST
Ys vijayamma arrested in nallagonda district

నల్లగొండ జిల్లాలో వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనను నిరసిస్తూ ఈరోజు తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్‌లో విజయమ్మ, షర్మిల దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేశారు. విజయమ్మ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వైసిపి బ్యానర్లు, జెండాలను దహనం చేశారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన తరువాతే తమ ప్రాంతంలో పర్యటించాలని తెలంగాణవాదులు డిమాండ్‌ చేశారు.

 

వైఎస్ విజయమ్మ నల్లగొండ జిల్లా పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఖమ్మం జిల్లాకు తరలించారు. విజయమ్మ పర్యటనను నిరసిస్తూ జిల్లాలోని హుజూర్ నగర్ లో వైసిపి నాయకులను తెలంగాణ వాదులు, కాంగ్రెస్ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ వాదులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురు తెలంగాణ వాదులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వరద బాధితులను పరామర్శిస్తున్న విజయమ్మ కాన్వాయ్ ను పోలీసులు నిలిపివేశారు.

 

పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆమె ఆందోళనకు దిగారు. దాంతో నల్లగొండ, ఖమ్మం రహదారిపై తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పరిస్ధితిని గమనించిన పోలీసులు విజయమ్మను అరెస్టు చేసి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్ కు పంపించారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles