Inquiry on prime suspect ram singh suicide

delhi gang rape, ram singh prime suspect, tihar jail

inquiry on prime suspect ram singh suicide

ram-singh.png

Posted: 03/11/2013 12:46 PM IST
Inquiry on prime suspect ram singh suicide

ఢిల్లీ లో విద్యార్థిని మీద సామూహిక అత్యాచారం చేసిన వారిలో తిహార్ జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు రాంసింగ్ కొన్ని రోజులుగా మనస్తాపంలో ఉన్నట్టుగా కనిపించాడని అంటున్నారు.  అందువలన అతను ఆత్మహత్య చేసుకునే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగానే పహరా కాస్తున్నారు.  అయినా రాం సింగ్ కాపలా దారుల కళ్ళు, అదే సెల్ లో ఉన్న ఇతర ఖైదీల కళ్ళు కప్పి తన వంటి మీద దుస్తులతో ఆత్మహత్య చేసుకున్నాడు.  

ఈ సంఘటన మీద పలువురు విమర్శలు చేసారు.  తిహార్ జైల్ కి ఒకప్పుడు డైరెక్టర్ జనరల్ గా పనిచేసి కిరణ్ బేదీ, ఆ ఖైదీ అందరి కళ్ళను ఎలా కప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడో విచారణలోనే తేలుతుంది కాబట్టి వేచి చూడవలసిందే అన్నారు.  తప్పించుకునే దార్లన్నీ మూసుకునిపోయాయి అని అనుకున్నప్పుడే ఖైదీలు అలాంటి పని చేస్తారు.  మరి అటువంటి ఖైదీ మీద ఇ-వాచ్ లేదా హెచ్-వాచ్ లు ఎంత సమర్ధవంతంగా ఏర్పాటు చేసారన్నది చూడవలసి వుంది అని ఆవిడ అన్నారు.  అధిక ప్రమాణంలో జరిగిన ప్రచారం మూలకంగా ఖైదీని జైలు లోపల బయటా కూడా అందరూ బహిష్కరించారు అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు.  

జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు మమతా శర్మ, విచారణలో ఉన్న ఖైదీమీద నిఘా పెట్టలేకపోయారు.  దీని మీద దర్యాప్తు చెయ్యాలి అన్నారు.  మెట్రో పోలిటన్ మేజిస్ట్రేట్ ఈ సంఘటన మీద విచారణ చెయ్యబోతున్నారని అనధికారిక వార్త వినవస్తోంది.  

ఈ సంఘటన తెలియగానే రాంసింగ్ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు.  రాంసింగ్ తమ్ముడు,  ఈ కేసు విచారణ త్వరగా ముగియాలనే కోరుకున్నామని, ఈ వార్త షాక్ కలిగించినా మాకు బాధ అనిపించటం లేదని అన్నాడు.  ఇందులో అనుమాన పడవలసిన విషయం ఉన్నట్టుగా తామేమీ భావించటం లేదని కూడా అతను అన్నాడు.  అంటే రాంసింగ్ ఆత్మహత్య చేసుకునే ఉంటాడని వాళ్ళు అనుకుంటున్నారు.  అన్న మీద కేసు చాలా బలంగా ఉండటమే అందుకు కారణమై వుంటుందని అతనన్నాడు.

రాం సింగ్ ది క్రిమినల్ బుర్ర కాబట్టి, తనకు కావలసిన పనికి అవకాశం కోసం కనిపెట్టటం, దానికోసం ఎదురు చూడటం ఇలాంటివి చెయ్యగలుగుతాడు.  పైగా అవమాన భారంతో కలిగిన మానసిక వత్తిడి అందుకు ప్రేరేపించి వుంటుందంటున్నారు విశ్లేషకులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shivaratri was performed with fervor in all parts of andhra pradesh
Sivaratri performed at srisailam in traditional manner  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles