Rasamayi balakishan contest for parakala by election

Rasamayi Balakishan, contest, Parakala, by-election, BJP, Singer, Telangana singer, Bharathiya Janata Party, politics, political party, telangana, T-issue, T-JAC, KCR, TRS, CPI, CPM, Left parties, by-elections, live updates, elections, bi-elections, leaders, Congress, polling booth, YSRC, votes, voters, live telecast, polls, 18 regions, nellore, agitation, protest, police, security, fight, situation, voting rate, ministers, rigging, rules volation

Rasamayi Balakishan contest for Parakala by-election.

Rasamayi Balakishan contest for Parakala by-election.gif

Posted: 05/05/2012 06:42 PM IST
Rasamayi balakishan contest for parakala by election

balakishanత్వరలో పరకాలలో జరగనున్న ఉప పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. తెలంగాణ వాదం బలంగా ఉన్న ఆ ప్రాంతంలో ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి పలు పార్టీలు పోటీపడుతున్నాయి. దేశంలో జాతీయ పార్టీలనేవే లేవని, జాతీయ పార్టీల వల్ల తెలంగాణ వచ్చే అవకాశం లేదంటూ టీఆర్‌ఎస్‌ అదినేత కేసీ ఆర్‌ ఇటీవల వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు, తమ పార్టీపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు విరుచుకుపడుతున్న తీరుతో అగ్గిమీద బుగ్గి అవుతున్న భారతీయ జనతా పార్టీ కీలెరిగి వాత పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చేనెల జరగనున్న ఉప ఎన్నికల్లో పరకాల స్థానాన్ని కైవసం చేసుకొని పాల మూరు ఫలితాన్ని పునరావృతం చేస్తామంటున్న కమలనాథులు అందుకు అనువైన రీతిలో పావులు కదుపుతున్నారు.

పాలమూరు స్థానానికి అనూహ్యం గా యెన్నం శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దించి సాను కూల ఫలితం సాధించిన బీజేపీ, ఈసారి పరకాల లోనూ అదే ప్రయోగం చేయాలనుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు అనువైన అభ్యర్థి కోసం జరుపుతున్న అన్వేషణలో ఉన్న బీజేపీ నాయకత్వం ముందుకు అనూహ్యంగా ప్రముఖ కళాకారుడు, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధి, అంకిత భావంతో పని చేస్తున్న రసమయి బాలకిషన్‌ పేరును కొందరు తెలంగాణ వాదులు ప్రతిపాదనకు తీసుకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటిదాక బాలకిషన్‌ అభ్యర్థిత్వంపై అంతగా దృష్టి సారించని బీజేపీ నాయకత్వం ఒక్కసారిగా రసమయిపై ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిసింది.

పరకాల అభ్యర్థిగా బాలకిషన్‌ పేరు నాయకత్వం పరిశీలనలో ఉందన్న మాటను తీసివేయలేమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అభ్యర్థిత్వంపై స్థానికంగా జరుగుతున్న అభిప్రాయ సేకరణలో చక్కటి సానుకూల స్పందన లభించిందని, అన్నీ కలిసొస్తే రసమయి అభ్యర్థిగా ఖరారైనా ఆశ్చర్యం లేదని కొందరు సీనియర్‌ నేతలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shah rukh khan kolkata vs sourav ganguly today
Is meditation cures asthma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles