పొలార్డ్, డ్వేన్ బ్రేవో, సునీల్ నరైన్, శామ్యూల్స్, ఆండీ రస్సెల్... వీళ్లంతా ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న వెస్టిండీస్ క్రికెటర్లు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో వన్డేల్లో, టి20ల్లో రాణించిన వీళ్లందరికీ టెస్టు జట్టులో స్థానం దక్కలేదు. కారణం... ఐపీఎల్. ఇప్పటికే న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెట్‌ను దె బ్బతీసిన ఈ ధనిక లీగ్... తాజాగా వెస్టిండీస్ బోర్డునూ దెబ్బతీసింది.ఐపీఎల్ ఉన్న సమయంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుండా న్యూజిలాండ్ బోర్డు తమ ఆటగాళ్లకు మేలు చేసింది. వెస్టిండీస్ మాత్రం తమ దేశంలో ఒక పెద్ద జట్టు (ఆస్ట్రేలియా) ఆడుతున్నా... ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లందరినీ వదిలేసింది. జట్టు ప్రయోజనాల కంటే ఆటగాళ్లు డబ్బు సంపాదించుకోవడమే ముఖ్యమని భావించింది.
డాషింగ్ ఆటగాడు క్రిస్‌గేల్‌తో వెస్టిండీస్ బోర్డుకు ఉన్న వివాదం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఏడాది పాటు సాగదీసిన తర్వాత తాజాగా గేల్, బోర్డు రాజీకి వచ్చాయి. ఈలోగా గేల్ వెళ్లి ప్రపంచం నలుమూలలా ఉన్న లీగ్‌లన్నీ ఆడేసి వచ్చాడు. ఒకవేళ పొలార్డ్, బ్రేవో, శామ్యూల్స్‌లాంటి ఆటగాళ్లను ఐపీఎల్ ఆడకుండా అడ్డుకుంటే వాళ్లు కూడా గేల్ దారిలో తిరుగుబాటు చేస్తారనే భయం కావొచ్చు. వెస్టిండీస్ టెస్టు జట్టును ప్రకటించే సమయానికే ఐపీఎల్‌లో ఆడే కరీబియన్ హీరోలంతా భారత్‌లో లీగ్ కోసం దిగారు.
యువ స్పిన్నర్ సునీల్ నరైన్ కేసును ఉదాహరణగా తీసుకుంటే... నరైన్ చాంపియన్స్ లీగ్‌లో ట్రినిడాడ్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఐదో సీజన్ వేలంలో ఈ యువ స్పిన్నర్‌ను కోల్‌కతా జట్టు ఏకంగా 7 లక్షల డాలర్లు (రూ. 3.5 కోట్లు) వెచ్చించి కొనుక్కుంది. అయితే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఇప్పటిదాకా అద్భుతంగా బౌలింగ్ చేసిన నరైన్ టెస్టులు ఆడాలని బోర్డు కోరింది. కానీ నరైన్ దీనికి ఒప్పుకోలేదు. దీంతో బోర్డుకు మరో దారి లేకపోయింది. ‘నరైన్ ఒకవేళ ఇక్కడే ఉండి ఆడినా... పూర్తిగా మనసు పెట్టి ఆడలేడు. ఐపీఎల్ ఆడాలనే అతడి కోరికను మేం మన్నించడమే భవిష్యత్‌కు మంచిది’ అని వెస్టిండీస్ కోచ్ వ్యాఖ్యానించడం విశేషం.
ఈ విషయంలో వెస్టిండీస్ అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్ డారెన్ బ్రేవో. ఐపీఎల్ వేలంలో డెక్కన్ చార్జర్స్ జట్టు బ్రేవోను కొనుక్కుంది. అయితే అదే సమయంలో టెస్టు సిరీస్ షెడ్యూల్ ఖరారవడంతో... తాను అందుబాటులో ఉండటం లేదని, జాతీయ జట్టుకు టెస్టులు ఆడటమే తన ప్రాధాన్యతని స్పష్టం చేశాడు. దీంతో ఈ ఒక్కడిని మాత్రమే టెస్టు జట్టులోకి ఎంపిక చేశారు.తమతో ఆడాల్సిన వెస్టిండీస్ ఆటగాళ్లు వెళ్లి ఐపీఎల్ ఆడి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే... ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం టెస్టులు ఆడబోతున్నారు. ఇది కచ్చితంగా వారిలో అసంతృప్తిని పెంచే అంశం. వాట్సన్, వార్నర్, క్లార్క్, మైక్‌హస్సీ... ఇలా వీళ్లలో ఎవరు వచ్చి ఆడినా ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లూ ఆడిస్తారు. కానీ వీళ్లకు ఆ అవకాశం లేదు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసి భారత్ కు వచ్చే సమయానికి 70 శాతం మ్యాచ్‌లు పూర్తవుతాయి.
మిగిలిన కొద్ది మ్యాచ్‌ల్లో ఆడినా వీళ్లకు మ్యాచ్‌ల నిష్పత్తి ప్రకారమే డబ్బు వస్తుంది. ఆర్థికంగా తమని బాగా స్థిరపరిచే లీగ్‌కు వెళ్లలేకపోవడం ఆసీస్ క్రికెటర్లను కూడా బాధించినట్లుంది. అందుకే పాంటింగ్ ఐపీఎల్‌కు విండో ఉండాలని డిమాండ్ చేశాడు. పాంటింగ్ ఐపీఎల్‌లో ఆడకపోయినా... ఈ వ్యాఖ్య చేయడానికి కారణం.. సహచరుల మాటలను వినడమే కాబోలు. ఎవరిని జట్టులోకి ఎంపిక చేయాలనేది ఆయా బోర్డుల ఇష్టం. ఆస్ట్రేలియా కూడా ఇదే అనుకుని ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను ఎంపిక చేస్తే ఏం జరుగుతుంది? అంతర్జాతీయ క్రికెట్ చచ్చిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా ఆలోచించాలి. ఆటగాళ్లందరి ప్రాధాన్యం ఐపీఎల్ అయినప్పుడు... దానికి ప్రత్యేక విండో ఇవ్వాలి. లేదంటే ఆటగాళ్లకు ఎన్‌ఓసీ ఇవ్వకుండా... వాళ్లను జాతీయ జట్టుకే ఆడించాలని ఆయా బోర్డులను కోరాలి. లేదంటే... ఇప్పుడు రెండు దేశాల్లో ఉన్న సమస్య రేపు ప్రపంచ క్రికెట్ సమస్యగా మారడం ఖాయం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more