• masa
  • masa
Kumbha Raasi

ఆదాయం: 5 వ్యయం : 2 రాజపూప్యం : 5 అవమానం : 4

ఈ రాశివారి అదృష్టసంఖ్య ‘8’. 2, 3, 6, 9 సంఖ్యలతో కూడిన తేదీలు మంగళ, శుక్ర, సోమవారాలతో కలిసి వస్తే యోగప్రదం. గృహంలో నిత్యదీపారాధనలు, సంధ్యకాలంలో శివదర్శనములు, ఏదేని పురాణం నిరంతర పఠనం, ధర్మకార్యంలో పాల్గొనడం వంటివి నిత్యం చేస్తే గ్రహ అనుకూలత.

ఈ రాశివారికి గురుబలం మోస్తరు వున్నా.. అనంతరం యోగదాయకంగా వుంటుంది. అఖంఢ ధనప్రాప్తి, శుభకార్యాల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొత్తపరిచయాలు లాభిస్తాయి. ధన సమృద్ధి కలిగి దానధర్మాలు చేస్తూ.. తోటివారికి చేయూతనిస్తార. కొన్ని సందర్భాల్లో అనుమాన మేఘాలు కమ్ముకోవడం వల్ల ప్రభుత్వపరంగా జరిగిన పొరపాటుకు మూల్యం చెల్లించాల్సి వుంటుంది. గృహనిర్మాణానికి భూసేకరణ చేయు ప్రయత్నాలు ఫలించవు. నోటిదురుసుతనం వల్ల కొన్ని కార్యాలు మధ్యలోనే ఆగిపోతాయి. శ్రమాధిక్యత, ప్రతి పనిలో ఆటంకాలు వున్నా.. అత్యం ఫలితం అనుకూలం.

ఉద్యోగులకు వృత్తిపరమైన చికాకులు, ఆలోచన విధానంలో మార్పు. రాజకీయ నాయకులకు వ్యతిరేక పవనాలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మందగించే సూచనలున్నాయి. కొన్ని సందర్భాల్లో దైవశక్తియే ముందుకు నడిపిస్తుంది.

సంవత్సరం మొత్తం ఆదాయవ్యయాలు సముపాళ్లలో వుంటాయి కాబట్టి ఆర్థికపరంగా ఎక్కువ సమస్యలు వుండవు. వ్యవసాయరంగంలో వున్నవారికి, శ్రామికులకు ఎటువంటి మార్పులు సంభవించవు. సామాన్య జీవన విధానాన్ని కొనసాగిస్తూ.. శ్రమకు తగ్గ ఫలితాలను ఆర్జిస్తారు.

వ్యాపార వ్యవహారాలలో, ఆర్థిక లావాదేవీలలో మంచి లాభాలను, విజయాలను సొంతం చేసుకుంటారు. సంవత్సరం మొత్త ధనాదాయం పెరుగుతూ, తరుగుతూ వుంటూ.. సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు మధ్యమధ్యలో అవసరమయ్యే ఆర్థిక లావాదేవీల కోసం ఋణాలను సేకరించే ప్రయత్నాలు చేస్తారు. వ్యవసాయరంగంలో వున్నవారికి, శ్రామికులకు ఎటువంటి మార్పులు సంభవించవు. సామాన్య జీవన విధానాన్ని కొనసాగిస్తూ.. శ్రమకు తగ్గ ఫలితాలను ఆర్జిస్తారు.

కుటుంబ సభ్యులతో అసౌఖ్యతతో వుండటం వల్ల గృహంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది. జీవనదారుల్లో వ్యతిరేక ప్రభావాలు కలుగుతాయి. అయినప్పటికీ వీరు అన్ని సమస్యలను అధిగమించి తమ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారు.

కుంభ రాశికి చెందిన వారు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఒకింత తట్టుకుని నిలబడగడిగే శక్తి ఉంటుంది. సాధారమంగా జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వీరి దరిచేరవు.అయితే కొన్నిసార్లు ఆరోగ్యం పట్ల అశ్రద్ద ప్రదర్శించటం వల్ల అనారోగ్యం చుట్టుముడుతుంది. ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు దృఢకాయులుగా ఉండటం వల్ల వారిని ఏ అనారోగ్యం ఏమీ చేయలేదు. సహజంగా ఉదర సంబంధిత వ్యాధులు మాత్రమే వీరిని బాధిస్తాయి. రక్తహీనత మూలంగా కొన్ని అనారోగ్యాలు వీరిని ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది.

valuprma