• masa
  • masa
Dhanus Raasi

ఆదాయం : 2 వ్యయం : 8 రాజపూజ్యం : 6 అవమానం : 1

ఈ రాశివారి అదృష్టసంఖ్య ‘3’. 1, 2, 5, 9 సంఖ్యలతో కూడిన తేదీలు ఆది, బుధ, గురువారాలతో కలిసి వస్తే యోగప్రదం. శని గ్రహ జపములు, నియమాలు, నువ్వులనూనెతో శనివారం సూర్యోదయాత్ పూర్వం దీపారాధన చేసి, శనిస్తోత్రం పఠిస్తే అనుకూల ఫలితాలు పొందుతారు. స్త్రీలు శ్రీసాయి ఆరాధనలు, గణేశ ప్రార్థనలు, సుబ్రహ్మణ్య స్తోత్ర పఠనాలు చేస్తే సంతానం సద్బుద్ధి కలిగి మన:ప్రశాంతత పొందగలరు.

ఈ రాశివారికి గురుబలం ఓ మోస్తరుగా వున్నా.. తదుపరి సంవత్సరం యోగప్రదంగా వుంటుంది. ఆచర వ్యవహారాలను గౌరవించుట, దైవకార్యాలయందు తరుచుగా పాల్గొనుట చేస్తారు. నూతన గృహనిర్మాణాలు చేయుట, అపూర్వ వస్తులాభం కలుగుతాయి. పుత్రసంతాన వృద్ధి, సతానానికి ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహం తదితర కార్యాలు జరుగుతాయి. అందరితోనూ సత్సంబంధంతో ముందుకు సాగుతారు.

కొన్ని సందర్భాల్లో అనుకోని వివాదాలు, సంబంధంలేని కలహాలు ఎదురవుతాయి. మనశ్శాంతి వుండకపోవడం, ఆందోళన వంటివి వున్నప్పటికీ.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. విద్యార్థులు అధికశ్రమ, పట్టదుల కలిగివుంటేనే ఫలితాలు పొందగలరు. వృత్తి ఆధారిత జీవనం సాగించేవారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు వుంటాయి. వ్యాపారులు లాభాలకంటే తమ వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం తంటాలు పడతారు. చిరువ్యాపారులు కనీస పెట్టుబడులతో వ్యాపారం సాగించడం మంచిది. ప్రతిరంగంలోనూ పోటీతత్వం విపరీతంగా ఎదుర్కోవలసి వుంటుంది.

ఆర్థిక లావాదేవీలలో, వ్యాపార వ్యవహారాలలో అధికంగా సమస్యలు ఏర్పడుతాయి. ధనాదాయం స్థిరంగా వుండకుండా.. ధనవ్యయం అధికం అవుతుంది. వ్యాపారంలో వున్న భాగస్వాములతో మనస్పర్థలు ఏర్పడే సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి. మధ్యతరగతి వారయిన కలప, పేపరు, కోళ్లు, రైతులు, వ్యాపారస్తులకు ఈ కాలం సామాన్యంగానే నడుస్తుంది.

చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. వ్యాపారులకు అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఎదురయ్యి.. కొత్త అనుభవాలను రుచిచూడాల్సి వస్తుంది. వ్యవసాయదారులకు, శ్రామికులకు కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఇండస్ట్రీలు వున్నవారి పరిస్థితి కూడా ఈ సంవత్సరం కష్టంగానే వుంటుంది. ఫలితం దొరికినట్టే దొరికి.. తరువాత కనుమరుగైపోతుంది. అయితే.. శుభకార్యాలలో, వ్యాపార పెట్టుబడులో మెల్లగా ఫలితాలు లభిస్తాయి.

ధనవ్యయం తగ్గడం వల్ల తరుచూ బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడుతాయి. తీవ్ర మనస్థాపానికి మానసిక ఒత్తిళ్లకు గురవుతారు. 

ఆరోగ్యానికి సంబంధించిన అనేక బాధలను అనుభవిస్తారు. తరుచూ నడుంనొప్పి, నరాల బలహీనతకు లోనవుతుంటారు. అధిక శ్రమ, శిరోభారం కూడా కలుగుతుంది. ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు గురిచేసినప్పటికీ.. తమ ఆలోచన విధానంతో వాటిని నెగ్గుకుంటూ ముందుకు సాగిపోతారు.

valuprma