• masa
  • masa
Kanya Raasi

ఆదాయం : 11 వ్యయం : 5 రాజపూజ్యం : 4 అవమానం : 5

ఈ రాశివారి అదృష్టసంఖ్య ‘5’. 1, 3, 6, 8 సంఖ్యలతో కూడిన తేదీలు ఆది, బుధ, గురు, శనివారాలతో కలిసి స్తే యోగప్రదం. చండీపారాయణ, హోమాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, గురువార నియమాలు, గురు, రాహు, కేతు మంత్రజపములు చేస్తూ.. అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తే.. సుఖజీవనం కొనసాగిస్తారు. స్త్రీలు శివస్తోత్రం పఠిస్తే.. శుభం, జయం కలుగుతుంది.

ఈ రాశివారు ప్రతిపనిలోనూ ఆశించిన ఫలితాన్ని పొందుతారు. సంకల్పంతో శత్రువులపై జయిస్తారు. కొన్ని వ్యవహారాల్లో అనవసర రాద్ధాంత కలుగడం వల్ల కలహప్రాప్తి కలుగుతుంది. పరులతో జాగ్రత్తగా వుంటే మంచిది. అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పరపీడ, జనఘోషల వల్ల మానసిక అశాంతి కలిగి గృహంలో అసౌకర్యంగా వుంటుంది. గృహాలు, స్థలాల క్రయవిక్రయాల వ్యవహారాల్లో మెలుకువగా వుండాలి.

రాజకీయ నాయకులకు తమ పదవికి ఇతరుల నుంచి గట్టిపోటీ ఎదురవుతుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం వుంటుంది. విదేశీయానం చేయడం మంచిదే. వైద్యులకు వినూత్న పద్ధతిలో వైద్యం చేయడంతో కీర్తిప్రతిష్టలు దక్కుతాయి.

వ్యాపారస్తులు ఋణభారం నుండి విముక్తి పొందుతారు. వ్యవసాయదారులు, శ్రామికులు శ్రమకు, కష్టానికి తగిన మంచి ఫలితాలను పొందుతారు. చిన్నచిన్న సమస్యలు, కష్టాలు ఏర్పడినా.. వాటిని అధిగమించి ముందుకు సాగుతారు.

సంవత్సర ప్రారంభంలో కొన్ని ఆర్తిక పరమైన సమస్యలు ఎదురయినప్పటికీ.. వాటిని అధిగమించి జీవన విధానాన్ని ముందుకు కొనసాగిస్తారు. ఉద్యోగ, వ్యాపార, వృత్తి జీవన విధానాన్ని అనుసరించేవాళ్లకు జూన్ నెల తరువాత ఆశించిన మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. 

ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవితాన్ని సుఖంగా కొనసాగిస్తారు. మొదట కుటుంబసభ్యులతో తగువులు, వివాదాలు వచ్చినప్పటికీ.. వాటిని పరిష్కరించుకుంటారు. కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో సంతానం లేనివారికి సతాన కోరిక సిద్ధిస్తుంది.

ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గ్రహాలదోషాల వల్ల కలిగే కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సి వుంటుంది. పూర్వం నుండి వెంటాడుతున్న శని నుండి విముక్తి పొందుతారు.  అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతి కూలించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ముఖ్యంగా ఉదర, చర్మ సంబంధింత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

valuprma