• masa
  • masa
Simha Raasi

ఆదాయం : 8 వ్యయం : 14 రాజపూజ్యం : 1 అవమానం : 5

ఈ రాశివారి అదృష్టసంఖ్య ‘1’. 3, 4, 5, 9 సంఖ్యలతో కూడిన తేదీలు ఆది, మంగళ, బుధవారాలతో కలిపి వస్తే యోగప్రదం. ప్రతినెల మాసశివరాత్రిరోజు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన జరిపితే అనుకూల ఫలితాలు పొందుతారు. స్త్రీలు మంగళ, శుక్రవారాల్లో నియమాలు పాటిస్తూ, అమ్మవారిని ఆరాధిస్తే స్థైరధైర్యం పొందుతారు.

ఈ రాశివారికి సంవత్సరంమంతా బృహస్పతి, శనైశ్చర గృహబలం అంతంత మాత్రంగానే వుంటుంది. కొన్ని శుభకార్యాలకోసం అధిక ధనవ్యయం చేస్తారు. ముఖ్యమైన వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లో చాకచక్యంగా వుంటేనే అనుకూల ఫలితాలు కలుగుతాయి. శరీర ఆరోగ్యం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి.

గృహంలో వుండే పెద్దవారి ఆరోగ్యం నిలకడ లోపించి ఆందోళన కలిగిస్తుంది. రుజువర్తన, ధర్మబుద్ధి, ఉత్తమ లక్షణాలను గ్రహించి ప్రవర్తించడం మంచిది. గతంలో ఇచ్చిన మొండిబకాయిలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిపుష్టి కలిగి వుంటారు.

వ్యాపార స్థలాల్లో రద్ది ఎక్కువగా వుండటం వల్ల చోరుల వల్ల హానీ, ద్రవ్యనష్టం కలిగే అవకాశం వుంది. కొన్ని సమయాల్లో అనవసర కంగారు, భయం, ఆత్మస్తుతి, పరనింద, తప్పనిసరి దూర ప్రయాణాలు అనారోగ్యం కలుగుతాయి. రాజకీయనాయకులకు సొంతింట్లోనే ఇబ్బందులు వుంటాయి. విద్యార్థులు ఎంతో కష్టంగా ముందుకు కొనసాగుతారు. సినీరంగంవారికి నిరాశాజనక కాలం.

సంవత్సర ప్రారంభంలో ఉద్యోగ, వ్యాపారపరంగా ఆర్థిక లాభాలను పొందుతారు. తద్వారా గృహాలలో శుభకార్యాలను నిర్వహించుకుంటారు. అయితే కాలంగడిచేకొద్దీ ఫలితాలు తగ్గుముఖం పడుతాయి. వ్యవసాయం, శ్రామిక రంగాలలో వున్నవారికి ఈ సంవత్సరంలో ప్రారంభదశ చాలా మేలు.

ఇండస్ట్రీలను నిర్వహించుకునే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కత్తిమీద సాములా సాగుతుంది. ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని బదలీ చేసుకోవడం ఎంతో మేలు. 

వస్త్రం, బంగారం, లోహాలు, కిరాణా వ్యాపారస్తులకు సంవత్సరంలో ఉత్తరార్థం ఎంతో ఉత్తమమైంది. అలాగే వైద్యులు, రాజకీయనేతలు, న్యాయవాదులు ఎన్ని ప్రతిబంధకాలు కలుగుతున్నా... చివరకు అనుకూల ప్రతిఫలాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఋణ మంజూరు విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.

గృహంలో సంతానం వల్ల కొత్త సమస్యలు ఏర్పడి, అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. తీవ్ర మానసిక వేదన, ఆందోళన, ఆరోగ్య సమస్యలతో నిత్య బాధుపడుతుంటారు.

సంవత్సర ప్రారంభంలో కుజుడు ప్రభావం వల్ల నేత్ర పీడనం, రక్తపోటు, ఆరోగ్య సమస్యలు, వైద్యపరమైన చికిత్సల సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అధిక ధనవ్యయం అవుతుంది. 

valuprma